BIG RESPONSE FORM PARENTS TOWARDS ENGLISH MEDIUM SCHOOLS : 96.17%

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుకు ఏపీ హైకోర్టు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను ప్రభుత్వం కొట్టేసింది. దీంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రులు/ సంరక్షకుల అభిప్రాయాలను తెలుసుకుని నివేదించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది.

ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 96.17 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించారు. ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని లిఖితపూర్వకంగా అందజేశారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనకు ఓకే చెప్పారు. తమ పిల్లల భవిష్యత్ కోసం ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉండాలనే ఆకాంక్షను తెలియజేశారంటోంది ప్రభుత్వం.

ఆంగ్ల మాధ్యమంలో బోధన విషయంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 1 –5 తరగతి చదివే విద్యార్థులు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో తెలుసుకొనేందుకు తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలను కోరింది. ఏ మీడియంలో బోధన కొనసాగించాలంటూ ప్రభుత్వం మూడు ఆప్షన్లను ఇచ్చింది. తెలుగు తప్పనిసరిగా ఉంటూ ఇంగ్లీష్ మీడియం.. తెలుగు మీడియంలో బోధన.. ఇతర భాషల్లో బోధన అంటూ మూడు ఆప్షన్లుగా ఇచ్చారు.
వీటిలో మొదటి ఆప్షన్‌ ఇంగ్లీష్ మీడియంకు 96.17 శాతం మంది ఓకే చెప్పారు. రెండో ఆప్షన్ తెలుగు మీడియం కోరుకున్నవారు 3.05 శాతం ఉన్నారు. మూడో ఆప్షన్‌కు 0.78 మాత్రమే ఓకే అన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు 17,87,035 మంది ఉండగా.. 17,85,669 మంది తల్లిదండ్రులు తమ అంగీకరాన్ని (ఐచ్ఛికాన్ని) తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఎక్కువమంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంకు ఓకే చెప్పడంతో.. ప్రభుత్వం హైకోర్టుకు నివేదించనుంది.

Top Post Ad

Below Post Ad