
హైకోర్టు ఉత్తర్వులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా నిమ్మగడ్డ
రమేశ్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టగా.. ఆయన నియామకం చెల్లదంటూ ఏజీ అభ్యంతరం
వ్యక్తం చేశారు. ఇది జరిగిన కాసేపటికే ఎస్‌ఈసీగా ఆయన బాధ్యతల స్వీకరణకు సంబంధించి
ఇచ్చిన ఉత్వర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎస్‌ఈసీ కార్యదర్శి శనివారం
అర్ధరాత్రి ప్రకటించారు. కాగా, ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా 1996 బ్యాచ్‌కు చెందిన
జి.వాణీమోహన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం
అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఆమె సహకారశాఖ కమిషనర్‌గా ఉన్న ఆమెను ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా
నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు వెలువరించారు.
ఎన్నికల కమిషనర్ కార్యదర్శితో పాటు సహకార శాఖ కమిషనర్, ఏపీ డైరీ డెవలప్‌మెంట్
అథారిటీ ఎండీగా, పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు
అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తన ఉత్తర్వుల్లో
పేర్కొన్నారు.