AP: స్కూళ్లు, కాలేజీలకు కొత్త రూల్స్‌.. పరీక్షలు, ఫీజులు అన్నిటా కొత్త నిబంధనలు

ఏపీలో ప్రయివేటు విద్యాసంస్ధల్లో తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్‌కు సర్వాధికారాలను కట్టబెడుతూ తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రయివేటు స్కూళ్లు, కాలేజీలన్నీ ఇకపై కమిషన్ పరిధిలోకి వెళ్లబోతున్నాయి.
 



ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్‌ స్కూళ్లకు, కాలేజీలకు ప్రభుత్వం మరో షాకిచ్చింది. స్కూళ్లు, కాలేజీల్లో ఇకపై ఇష్టానుసారంగా ఫీజుల వసూలుకు చెక్ పెడుతూ పాఠశాల విద్యనియంత్రణ కమిషన్‌కు ఫీజుల నిర్ణయాధికారాన్ని కట్టబెట్టింది. 

కమిషన్‌కే సర్వాధికారాలు: 
నాణ్యమైన విద్య అందించే క్రమంలో ఫీజులతో పాటు ప్రయివేటు విద్యాసంస్ధల్లో తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్‌కు సర్వాధికారాలను కట్టబెడుతూ తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రయివేటు స్కూళ్లు, కాలేజీలన్నీ ఇకపై కమిషన్ పరిధిలోకి వెళ్లబోతున్నాయి.

ఇకపై ప్రయివేటు విద్యా సంస్ధల్లో ఫీజులు, విద్యాబోధన, వసతులతో పాటు అన్ని అంశాలూ కమిషన్ పరిధిలోకి రానున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించే అధికారం కూడా కమిషన్ కు కల్పించారు.

అలాగే స్కూళ్లు, కాలేజీలతో పాటు ట్యుటోరియల్స్‌ పైనా కమిషన్‌కు అధికారం ఉంటుంది. ఎన్‌సీఈఆర్టీ, ఇంటర్మీడియెట్ బోర్డు, ఎన్‌సీటీఈ రూపొందించిన పాఠ్య పుస్తకాలను విద్యాసంస్ధలన్నీ వినియోగించేలా నిబందనలు కఠిన తరం చేస్తున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకూ పరీక్షల నిర్వహణ కూడా కమిషన్ పర్యేవేక్షించనుంది.కొత్త తరహాల ఫీజుల దరఖాస్తు:
ప్రతీ ఏటా విద్యాసంస్థలకు సంబంధించిన ఫీజుల నిర్ణయానికి కమిషన్ నోటిపికేషన్ జారీ చేస్తుంది. ఆ తర్వాత విద్యాసంస్ధలు ఆన్ లైన్లో ఫీజుల ప్రతిపాదలను దరఖాస్తు చేసుకోవాలి. ప్రతీ విద్యా సంస్ధ ఖాతా పుస్తకాలతోపాటు ఇతర డాక్యుమెంట్లు కమిషన్‌కు సమర్పించాలి.

విద్యాసంస్ధలు పేర్కొన్న ఫీజులు న్యాయబద్ధంగా ఉన్నాయా లేదా అనే విషయం కమిషన్ పరిశీలిస్తుంది. కమిషన్‌ నిర్ణయించిన ప్రమాణాలను పాటించని విద్యా సంస్థలకు ఫీజుల్లో కోత విధిస్తారు.

ఫీజుల వసూల్లోనూ కొత్త రూల్స్‌:
  1. ఏ విద్యాసంస్ధ కూడా ఏడాది ఫీజును ఒకేసారి తల్లితండ్రుల నుంచి వసూలు చేసేందుకు వీల్లేదు.
  2. ఫీజులను విడతల వారీగా చెల్లించేందుకు తప్పనిసరిగా అవకాశం కల్పించాలి.
  3. ప్రయివేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లకూ సర్వీస్ నిబంధనలను వర్తింపచేయనున్నారు.
  4. టీచర్ల నియామకంలో ఎన్‌సీటీఈ నిబంధనలు పాటించాల్సిందే.
  5. విద్యా సంస్థల్లో సమస్యలపై విద్యార్ధుల తల్లితండ్రులు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసేందుకు వీలుగా గ్రీవెన్స్ సెల్ ఉండాలి.
  6. స్కూల్ డేటాబేస్ నిర్వహణకు ఐటీ సెల్‌ను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.
  7. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయా విద్యా సంస్థలను బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచుతారు అలాగే గుర్తింపు రద్దు చేస్తారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad