ఒక్కొక్కరికి రూ.24వేలు, 6 నెలలు ముందే రెండో విడత సాయం: CM జగన్


ఏపీలో జగన్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే సీఎం జగన్ కొన్ని పథకాలు ప్రారంభించగా తాజాగా వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం పథకం రెండో విడత నేడు ప్రారంభించారు. శనివారం(జూన్ 20,2020) ఉదయం క్యాంప్ ఆఫీస్‌లో ఆన్‌లైన్‌ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు సీఎం జగన్. తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడారు. మొత్తం 81వేల 24 మంది చేనేతలకు లబ్ధి చేకూరింది. డిసెంబర్ 21, 2019న‌ ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్... ఆరు నెలల వ్యవధిలోనే రెండో విడత సాయం అందించడం విశేషం. ఈ పథకం కోసం మొత్తం రూ.194.46 కోట్లు ఖర్చు చేశారు. గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లు చెల్లింపుతో పాటు, కోవిడ్‌ మాస్కులు తయారు చేసిన ఆప్కో సంస్థకు రూ.109 కోట్లు చెల్లించింది ప్రభుత్వం.

చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న నేత కుటుంబాలకు ఆసరాగా మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేలు నగదు పంపిణీ చేశారు. కరోనా కారణంగా 6 నెలలు ముందుగానే ప్రభుత్వం సాయం అందించింది. వాస్తవానికి డిసెంబర్ 21న ఇవ్వాల్సిన ఆర్థిక సాయాన్ని ఆరు నెలల ముందుగానే ఇచ్చారు. పవర్‌ లూమ్స్‌ రావడం వల్ల చాలా మంది చేనేతలు ఆర్థికంగా ముందుకు సాగలేకపోయారు. కేవలం మగ్గాలను నమ్ముకుని జీవిస్తున్న వారికి ప్రభుత్వం ఏడాదికి రూ.24వేలు ఆర్థిక సాయం అందించి ముడి సరుకు, ఇతర అవసరాలకు ఉపయోగించుకునే విధంగా సాయపడుతోంది.
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad