ఆహా ఒక ప్రత్యేకమైన తెలుగు ఆన్-డిమాండ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, ఇది
అర్హా మీడియా & బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో
ఉంది.
మా విస్తృతమైన కంటెంట్ లైబ్రరీలో చలనచిత్రాలు, అసలైన వెబ్ సిరీస్ మరియు కళా
ప్రక్రియలలోని ప్రదర్శనలు ఉన్నాయి. కంటెంట్ క్రమం తప్పకుండా జోడించబడుతుంది
మరియు తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. మా కంటెంట్ ప్రకటన
రహితమైనది మరియు మీ ఆనందం మధ్య ఏమీ రాకూడదని మేము నమ్ముతున్నాము.
మొబైల్, టాబ్లెట్, వెబ్, స్మార్ట్ టీవీ మరియు స్ట్రీమింగ్ పరికరాలతో సహా
పరికరాల్లో లభిస్తుంది, ఇప్పుడు ఎక్కడైనా మరియు ప్రతిచోటా ఆహాను కనుగొని
చూడండి. మీ సౌలభ్యం మేరకు మీకు ఇష్టమైన కంటెంట్‌ను ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసి
చూడండి
Office Addresss:
ప్లాట్ నెం: 1265, ఆర్డీ నం 36,
జూబ్లీ హిల్స్, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా
PIN: 500033
అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి వీడియో కంటెంట్ ప్లాట్ ఫామ్‌లతో పోటీపడుతూ..
తెలుగు మార్కెట్లో కొత్త ఒరవడిని సృష్టించాలనే లక్ష్యంతో డిజిటల్ స్పేస్ లోకి
అడుగు పెట్టింది మైహోం గ్రూప్. ఇందులో భాగంగా ఆహా యాప్‌ను లాంచ్ చేసింది. త్వరలో
ఎక్స్ క్లూజివ్ షోస్‌ను ఆహా యాప్ ద్వారా స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రతి తెలుగు
వాడి గుండెలకు హత్తుకునేలా షోస్ రూపొందించే భారీ ప్రణాళికతో ఆహా యాప్ ప్రేక్షకుల
ముందుకు వచ్చింది.
మైహోమ్ గ్రూప్ ఆధ్వర్యంలో.. తెలుగు ఇండస్ట్రీలోని కీలక వ్యక్తుల భాగస్వామ్యంతో
ప్రేక్షకులకు మధురానుభూతిని అందించేందుకు వచ్చేసింది ఆహా యాప్. పలువురు సినీ
ప్రముఖులు, వ్యాపారవేత్తల సమక్షంలో శనివారం(ఫిబ్రవరి 08,2020) ఆహా యాప్ ప్రివ్యూ
కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నిర్మాత అల్లు
అరవింద్, మైహోం గ్రూప్ డైరెక్టర్ జూపల్లి రామురావు, సినీ దర్శకుడు క్రిష్,
హీరోలు విజయ్ దేవరకొండ, నవదీప్ లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఆహా యాప్‌లో టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్:
తెలుగు ఇండస్ట్రీల్లో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన అల్లు అరవింద్ ఆహాను సిద్ధం
చేయడంలో, కంటెంట్‌ను రూపొందించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. సరికొత్త
సినిమాలు.. ఎక్స్‌క్లూజివ్ కార్యక్రమాలు.. సినీ రంగంలోకి ప్రఖ్యాత వ్యక్తులతో
కార్యక్రమాలు.. ఇలా ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే కార్యక్రమాలెన్నింటినో ఆహా ద్వారా
మొబైల్ ఫోన్‌లో ఎక్కడైనా ఎప్పుడైనా చూడొచ్చు. తెలుగు మార్కెట్‌లో ఇలాంటి యాప్
అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. కొత్తదనాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకుల
హృదయాల్లో త్వరలోనే తమకు సుస్థిరమైన స్థానం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది
ఆహా టీమ్.
డిజిటల్ స్పేస్‌కి మంచి భవిష్యత్తు ఉందన్నారు నిర్మాత అల్లు అరవింద్. ఆహా యాప్
పూర్తిగా తెలుగు కంటెంట్‌తో ఉందన్నారు. ఈ యాప్‌ను తెలుగు ప్రజలంతా ఆదరిస్తారని
ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇది ఓన్లీ ప్రివ్యూ మాత్రమేనని, ఉగాది రోజు ఆహా యాప్
లాంచ్ చాలా గ్రాండ్‌గా ఉంటుందని తెలిపారు.
సరికొత్త సినిమాలు.. ఎక్స్‌క్లూజివ్ కార్యక్రమాలు:
నిర్మాణ రంగంలో 35 ఏళ్లుగా మైహోమ్ గ్రూప్ విశేష సేవలందిస్తోందన్నారు మైహోమ్
గ్రూప్ డైరెక్టర్ రామురావు. ఆహాలో ప్రస్తుతం 6 షోస్ ఉన్నాయని, ఈ సంవత్సరంలో
దాదాపు 25 షోస్ చూస్తారని చెప్పారు. డిజిటల్ మీడియా ఫీల్డ్ తమకు చాలా కొత్త
అన్న ఆయన.. తెలుగు కంటెంట్‌తో వస్తున్నాం కాబట్టి అందరికీ నచ్చుతుందన్న ఆశాభావం
వ్యక్తం చేశారు. ఆహా యాప్ ప్రివ్యూ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా
ఉందన్నారు హీరో విజయదేవరకొండ. తెలుగు ప్రేక్షుకులు సినిమాను ఆదరించినట్లు
మరెవ్వరు ఆదరించలేరన్నారు.
ఆహా యాప్‌లో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల్ని స్ట్రీమింగ్ కి రెడీ చేశారు.
ప్రస్తుతానికి ఇందులో సినిమాల్ని ఉచితంగా చూసే వెసులుబాటును కల్పించారు. ఆహా యాప్
గూగుల్ ప్లేస్టోర్‌లోనూ ఉచితంగా అందుబాటులో ఉంచారు.