AP కరోనా అలర్ట్: కొత్తగా 154 కరోనా కేసులు.. మొత్తం 3843


AP లో  కరోనా మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజు, రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14,246 శాంపిల్స్‌ను పరీక్షించగా 125మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి (29) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 154 కేసులు నమోదయ్యాయి. 

కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 3843కు చేరాయి. మరో 34మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1381కు చేరింది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad