AP : 10వ తరగతి పరీక్షలు రద్దు: ఇంటర్ విద్యార్థులంతా పాస్

Education Minister Declared that SSC Exams were cancelled in AP just now in press meet . 
అనేక తర్జనబర్జనల అనంతరం 10వ తరగతి  పరీక్షలు రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒకవైపు విద్యార్ధులు, తల్లిదండ్రులు మరియు రాజకీయ నాయకులు రద్దు చేయాలని డిమాండ్లు మరో వైపు కరోనా అంతకంతకు పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై శుక్రవారం పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా విద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినప్పటికీ, పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని ఇబ్బందులు పెరుగుతాయని పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. 
ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలు 10వ తరగతి  పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసినదే.

ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌లో ఫెయిల్ అయిన వారిని సైతం పాస్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో 2019- 2020 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ విద్యార్థులంతా పాస్ అయినట్లేనని స్పష్టం చేశారు.

విద్యార్ధులు ఫార్మేటివ్ అసెస్మెంట్- 1 & 2 సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ప్రగతి ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించనున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా లాక్ డౌన్ పీరియడ్ లో కూడా ‘విద్యామృతం’ పేరుతో డిడి సప్తగిరి లో వీడియో పాఠాలు , ‘విద్యాకలశం’  పేరుతో రేడియో కార్యక్రమాలను డిజిటల్ తరగతులు నిర్వహించడం తెలిసిందే. 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad