AP: పది పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్లు

ssc-exams

ఏపీలోనూ పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి తదితర రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఏపీలోనూ ఇదే తరహా విధానాన్ని అవలంభించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, రాజకీయ నాయకులు డిమాండ్‌ చేయడం ప్రారంభించారు. 

 విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర వర్గాలు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే డిమాండ్లు ప్రారంభించారు. అయితే తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేశారు. 

ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. పదో తరగతి పరీక్షలపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు లక్ష మంది సిబ్బంది అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ సరైంది కాదన్నారు. 

ఇతర రాష్ట్రాల తరహాలో ఏపీలో కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే ఇప్పటికే ఏపీ ఎస్‌ఎస్‌బీ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేయడమే కాకుండా.. ఏర్పాట్లపై ద`ష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
త్వరలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad