కరోనా మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనపై విమర్శలు


ఎలాంటి లక్షణాలు లేని కరోనా బాధితుల నుంచి.. వైరస్‌ ఎలా సోకుతుందనే విషయంలో కచ్చితమై నిర్ధారణలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 


లక్షణాలు లేనివారి నుంచి సంక్రమించడం 'చాలా అరుదు' అంటూ చేసిన ప్రకటనపై విమర్శలు రావడంతో స్పష్టతనిచ్చింది. లక్షణాలు లేని వారి నుంచి ఇతరులకు వైరస్‌ సంక్రమించడం చాలా అరుదని డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక విభాగం ఉన్నతాధికారి ప్రకటించడంపై... పరిశోధకులు, శాస్త్రవేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంస్థ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని విమర్శించారు. 


దీంతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన WHO... దీనిపై ఇంకా ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కొన్ని అధ్యయనాల ఆధారంగానే ఆ విషయాన్ని తెలిపినట్టు ప్రకటించింది

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad