ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏపీ హైకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు
చేశారు. కోర్టు తనను ఎస్‌ఈసీగా నియమించాలని తీర్పు ఇచ్చినా అమలు చేయకుండా..
కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఏపీ సీఎస్,
పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శిలను ప్రతివాదులుగా
చేర్చారు.. నిమ్మగడ్డ తరపున లాయర్ అశ్వనీదత్ కుమార్ పిటిషన్ దాఖలు చేయగా..
హైకోర్టు విచారణకు స్వీకరించింది.
పీ ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి
తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్, ఏపీ ఎన్నికల సంఘం విడివిడిగా
పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు
నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను వాయిదా
వేసింది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై విచారణ నడుస్తుండగానే.. ఏపీ హైకోర్టులో
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో పిటిషన్ వేయడం ఆసక్తికరంగా మారింది.