వచ్చేవారమే కరోనా చికిత్సకు హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్!


ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 వ్యాధికి మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్‌మెంట్ కోసం వచ్చేవారం నుంచి సింగపూర్ సంస్థ హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుంది. సింగపూర్ ఆధారిత బయో టెక్నాలజీ కంపెనీ Tychan తొలి దశ ట్రయల్ మొదలుపెట్టనుంది.

ఈ క్లినికల్ ట్రయల్‌ను Sing Health Investigational Medicine Unit నిర్వహించనుండగా.. ఆరు వారాల పాటు కొనసాగనుంది. కొవిడ్-19 వ్యాధికి కారణమయ్యే Sars-CoV-2 వైరస్ ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకునే మోనోక్లోనల్ యాంటీబాడీ లేదా రోగనిరోధక వ్యవస్థ ప్రోటీన్ TY027 సేప్టీ, ప్రభావాన్ని నిర్ణయించడమే ట్రయల్ ఉద్దేశమని Tychan ఒక ప్రకటనలో పేర్కొంది.

కోవిడ్ -19 రోగులకు చికిత్స చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు ఈ ట్రయల్ వ్యాక్సిన్ ఇస్తామని తద్వారా వారికి అంటువ్యాధులు రావని ప్రొఫెసర్ Ooi Eng Eong తెలిపారు. సింగపూర్ నుంచి COVID-19 ప్రభావిత ప్రాంతాలకు వెళ్లినవారిలో అంటువ్యాధులను నివారించడానికి ఈ ట్రయల్ ఉపకరిస్తుందని ఆయన చెప్పారు. TY027 ను సింగపూర్ రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆర్థిక అభివృద్ధి బోర్డు, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి అభివృద్ధి చేశారు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad