రాయల్ ఎన్‌ఫీల్డ్ షాకింగ్ నిర్ణయం, కార్యాలయాల మూసివేత

కరోనా దెబ్బకు స్వయంగా ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది


ప్రాంతీయ కార్యాలయాల మూసివేత:
 కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దాదాపు 12 రీజినల్ ఆఫీస్‌లను మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అంతర్జాతీయ సర్క్యులర్ జారీ చేసింది. 

ఇందులో మన దేశం నుండి కూడా కొన్ని కార్యాలయాలను మూసివేస్తున్నారు. ఈ జాబితాలో గురుగ్రామ్, చెన్నై, బెంగళూరు, ముంబై, జార్ఖండ్, హైదరాబాద్, భువనేశ్వర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించింది.

ఉద్యోగులకు ఊరట.
వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని రీజినల్ ఆఫీస్‌లను మూసివేయాలని నిర్ణయించామని, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ (CCO) లలిత్ మాలిక్ చెప్పారు. ఇలా చేస్తే ఉద్యోగుల ప్రయాణ సమయం తగ్గిపోతుందని చెప్పారు. 

కేవలం ఆఫీస్‌లు మాత్రమే మూసివేయనున్నారని, ఉద్యోగులను తొలగించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇది ఉద్యోగులకు ఊరట ఇచ్చే అంశం. అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశముంది.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad