నిత్య‌వ‌స‌రాలన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ, అమ్మేవారు మాత్రం క‌నిపించ‌రు.

అక్క‌డ దుకాణంలో నిత్య‌వ‌స‌రాలన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ, అమ్మేవారు మాత్రం క‌నిపించ‌రు.


అస‌లు ఆ షాపులో ఓన‌ర్లు ఎవ‌రూ ఉండ‌రు. మ‌రి వాటిని ఎలా కొనుగోలు చేయ‌టం..? షాపులో దొంగలు ప‌డితే మ‌రీ.. అనే సందేహాం క‌లుగుతుంది క‌దా..? అయితే, అక్క‌డ అలాంటి వాటికి అవ‌కాశం లేదు. ఎందుకంటే అక్క‌డ న‌మ్మ‌క‌మే పెట్టుబ‌డిగా న‌డుస్తోంది. ప్రజలు తమకు ఏ వస్తువులు కావాలన్నా.. అక్కడ షాపు ముందు ఏర్పాటు చేసిన ధరల పట్టికను చూసి డ‌బ్బు చెల్లిస్తారు.. కావల్సిన వస్తువు తీసుకున్న తర్వాత ఆ మొత్తాన్ని అక్క‌డ ఏర్పాటు చేసిన డ‌బ్బాలో వేస్తారు. అంతేకానీ, ఎవ‌రూ దొంగ‌త‌నం చేయ‌రు. ఇంత‌కీ ఇంత న‌మ్మ‌కంతో న‌డిచే షాపు ఎక్క‌డో అనుకుంటున్నారా.?..ఇక్క‌డే మ‌న ఇండియాలోనే ఉంది.

మిజోరాం రాజధాని ఐజ్వాల్‌ సమీపంలోని గ్రామాల్లో ఇలాంటి దుకాణాలు కనిపిస్తాయి. ఈ సాంప్రదాయాన్ని అక్కడ ‘నాగహా లో డావర్’ అని పిలుస్తారు. వ్యాపారులు ఉదయాన్నే అక్కడికి వచ్చి సరుకులను దుకాణాల్లో స‌ర్దిపెట్టి వెళ్లిపోతారు. మళ్ళీ సాయంత్రం తిరిగి వాటిని ఇంటికి తీసుకెళ్తారు. వస్తువులు, డబ్బులు అలా బయట వదిలేసినా దొంగతనాలు కూడా జరగవు. కరోనా వైరస్ సమయంలో ఈ దుకాణాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రజలు ఎలాంటి సమస్య లేకుండా నిత్యవసర వస్తువులు కొనుగోలు చేశారు. ఈ సంప్ర‌దాయం న‌చ్చ‌డంతో మ‌ణిపూర్‌లో కూడా ఇలాంటి దుకాణాల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం ఇప్పుడు ఈ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ గా మార‌టంతో లైకులు, షేర్లు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి షాప్స్ ఓపెన్ చేస్తే..ఇక‌ అంతే అంటూ నెటిజ‌న్లు అనేక కామెంట్లు చేస్తున్నారు.
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad