ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జులై 10 వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షల పై
పూర్తివివరాలు సమర్పించాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సికి జాతీయ
మానవ హక్కుల కమీషన్ నోటీసులు:
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10 వ తరగతి పరీక్షలు జులై 10వ తారీఖు నుండి
నిర్వహించాలని నిర్నయించిన విషయంపై ఆలిండియా హ్యూమన్ రైట్స్ అసోషియొసన్
(అంభాసిడార్) యమ్.డి ఖాలీద్ పాష జాతీయమానవ హక్కుల కమీషన్ వారికి పిర్యాదు చేయటం
జరిగింది.దేశంలో మరియు రాష్ట్రంలో కరోన వైరస్ వ్యాప్తి రోజు రోజుకు తీవ్రత ఎక్కువ
అవ్వటం వల్ల ఈ సమయములో పరీక్షలు నిర్వహించటం సరైన నిర్ణయం కాదని ఇందువల్ల
లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యం పై వారి తల్లితండ్రులు ఆందోళనను ద్రృష్టిలో
ఉంచుకొని మన సరిహద్దు రాష్రాలైన తెలంగాణా,తమిళనాడులో పదవతరగతి పరీక్షలు రద్దు
చేసి వారి యొక్క యస్సస్ మెంట్సు మరియు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్దులను
గ్రేడింగ్ పద్దతి ప్రకారం ఉన్నత తరగతులకు ప్రమొట్ చేసిన విధానాన్ని ఆంద్రప్రదేశ్
రాష్ట్రంలో కూడ అమలు చేసేలా చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇటీవల కాలంలో
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరువేలకు పైగ కరోన కేసులు నమొదు అవ్వటమే కాక 100 కి
చేరువలో మరణాలు నమొదు అయ్యాయని కావున జులై 10 వ తారీఖు నుండి నిర్వహించునున్న
పదోతరగతి పరీక్షలు రద్దు చేసి విద్యార్దుల ఆరోగ్యం,ప్రాణాలు కాపాడవలసిన భాద్యత
రాష్ట్ర ప్రభుత్వం పై ఉన్నదని కాబట్టి ప్రక్కరాష్ట్రాలు అనుసరించిన విధానాన్ని
అమలు చేసి విద్యార్దులకు, విద్యార్దుల తల్లితండ్రులుకు ఉపసమనం కల్పించాలని తమ
ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జాతీయమానవ హక్కుల కమీషన్ ఫిర్యాదును
స్వీకరించి జులై 10 వ తారీఖునుండి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలపై పూర్తి
నివేదిక అందచేయాలని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్సికి నోటీసులు జారిచేయటం
జరిగినది.
Notice
It is good idea to cancel our AP SSC exams
ReplyDeleteThis is the right way sir
ReplyDelete