ఏపీ లో కరోనా టెర్రర్: 24 గంటల్లో 54 మరణాలు.. ఆ ఒక్క జిల్లాలో వెయ్యికి పైగా కేసులు..


గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,086 కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 342, చిత్తూరులో 116, గుంటూరులో 596, కడపలో 152, కృష్ణా జిల్లాలో 129, నెల్లూరులో 100, ప్రకాశంలో 221, శ్రీకాకుళంలో 261, విశాఖపట్నంలో 102, విజయనగరంలో 56, పశ్చిమ గోదావరి జిల్లాలో 354 కేసులు నమోదయ్యాయి


రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 7,225 కేసులు నమోదు కాగా, తర్వాత కర్నూలు జిల్లాలో 6,604 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారీగా కరోనా టెస్టులు నిర్వహిస్తుండగా.. కేసులు కూడా అంతే స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో మరోసారి రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అలాగే రికార్డు స్థాయిలో ఒకే రోజు ఏకంగా 54 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 33,580 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 4,074 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 53,724కు చేరింది.

ఇక గడచిన 24 గంటల్లో ఏకంగా 54 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 696కు చేరింది. గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 9 మంది, గుంటూరు జిల్లాలో 9 మంది, కృష్ణాలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, కర్నూలులో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు చొప్పున మరణించారు. కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఏకంగా 1,086 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇక గడిచిన 24 గంటల్లో 1,335 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం 53,724 పాజిటివ్ కేసులకు గాను 24,228 మంది డిశ్చార్జ్ కాగా, 28,800 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad