Alternative Academic Calendar - complete information

అకడమిక్‌ క్యాలెండర్‌లోని ప్రధానాంశాలు:



  1. అడ్మిషన్ల సందర్భంగా విద్యార్థులను పాఠశాలలకు రాకుండా చూడాలి. వారి తల్లిదండ్రులను మాత్రమే రప్పించాలి.
  2. ప్రతి ఉపాధ్యాయుడు వారానికి ఒకసారి పాఠశాలకు రావాలి. వారు బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాల్సిన అవసరం లేదు.
  3. ఉపాధ్యాయుడు తన తరగతి గదికి సంబంధించి విద్యార్థి వారీగా ప్రణాళికను రూపొందించుకోవాలి.
  4. పాఠ్యాంశాలకు ఆన్‌లైన్‌ బోధన చేపట్టవచ్చు. కానీ ఆ బోధన ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌లో సూచించిన పాఠ్యప్రణాళికకు మాత్రమే పరిమితమై ఉండాలి.
  5. విద్యార్థులను మూడు విధాలుగా విభజించుకోవాలి. ఆన్‌లైన్‌ సౌకర్యాలు అందుబాటులో ఉన్న వారు(హైటెక్‌), రేడియో లేదా దూరదర్శన్‌ అందుబాటులో ఉన్న వారు(లోటెక్‌), కంప్యూటర్‌ గానీ మొబైల్‌ గానీ, రేడియో గానీ అందుబాటులో లేని వారు(నోటెక్‌).
  6. గ్రామ, పట్టణాల్లో ఎటువంటి సమాచార, ప్రసార, కంప్యూటర్‌ సాధనాలు అందుబాటులో లేని వారిపైన దృష్టి పెట్టే విధంగా టీచర్‌ ప్రణాళికను తయారు చేసుకోవాలి.
  7. 1 నుంచి 5వ తరగతి వరకూ కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 12 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్‌లో చూపిన విధంగా కృత్యాలు చేయించాలి.
  8. 6 నుంచి 8వ తరగతి వరకూ కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 4 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్‌లో చూపిన విధంగా ప్రాజెక్టు పనులు పిల్లల ద్వారా చేయించాలి.
  9. 9, 10 తరగతులకు విషయాల వారీగా బోధన చేపట్టవచ్చు. ఆన్‌లైన్‌, రేడియోల ద్వారా శిక్షణ చేపట్టవచ్చు.
  10. ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడానికి వీల్లేదు.
  11. తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్చుకోవడానికి టీసీ అడిగితే ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా అందించాలి.
  12. వలస కుటుంబాల పిల్లల ప్రవేశాలకు ఐడెంటిటీ నిరూపణ తప్ప ఏ ధ్రువపత్రాలు అడగకూడదు.
  13. స్థానికంగా విద్యావంతులైన యువత స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారి సేవలు వినియోగించుకోవచ్చు.
  14. ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో కూడా వారానికి ఒకసారి హాజరు కావాలి. కానీ అందరూ ఒక్క రోజే హాజరుకావాల్సిన అవసరం లేదు. వారు ఏ రోజు హాజరు కావాలన్న విషయమై హెచ్‌ఎం ఉత్తర్వులివ్వాలి. ఇవి నాడు-నేడు పాఠశాలలకు కూడా వర్తిస్తాయి.
  15. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారు, కంటైన్‌మెంట్‌ జోన్‌లలో నివసిస్తున్నవారు, శారీరక వైకల్యం కలిగినవారు, కంటైన్‌మెంట్‌ జోన్‌లలో పాఠశాలలు ఉన్న ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాల్సిన అవసరం లేదు.
  16. కానీ తరగతి వారీగా, విద్యార్థి వారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్‌లో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ ప్రణాళిక అమలు చేయాలి.
  17. ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌లో సూచించిన విధంగా ప్రతి టీచర్‌ రోజూ కనీసం 15 మంది తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి వారి పిల్లలు చేపట్టవలసిన విద్యా కార్యక్రమాల గురించి వివరించాలి.
  18. మరుసటి రోజు నుంచి ఐదుగురు చొప్పున తల్లిదండ్రులకు మళ్లీ ఫోన్‌ చేసి వారి పిల్లల పురోగతి తెలుసుకోవాలి. ఆ విధంగా వారానికి కనీసం 40 మంది విద్యార్థుల పురోగతి కనుక్కోవాలి.
  19. టీచర్లు రోజు వారీ పనిని డైరీలో నమోదు చేసుకుని ప్రతి శనివారం ఫొటో రూపంలో గూగుల్‌ ఫారంలో అప్‌లోడ్‌ చేయాలి. 







(From date 27/07/2020 to 04/09/2020)



తరగతి వారి కృత్యాలు   (with Diksha app links)
Class - III 

1 to 5 అన్ని తరగతులు, అన్ని subjects కు ఒక వారానికి "1st week Model Teacher work done" తయారుచేయడం జరిగింది. 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad