APలో 25 జిల్లాలు కాదు 26..? ఆ ఒక్క ప్రాంతం గురించే చర్చ అంతా..


నేడు సమావేశమైన ఏపీ క్యాబినెట్ లో దాదాపు ఇరవై రెండు అంశాలపై రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ ముఖ్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైనే అందరి దృష్టి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే దాని విషయమై మంత్రులు కూడా ఎక్కువ సేపు కేటాయించినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పటికే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 25 జిల్లాలు ఉన్న రాష్ట్రంగా మార్చేందుకు కావాల్సిన రూపకల్పన జరిగిపోగా అధ్యయన కమిటీ కూడా దీనికి అప్రూవల్ ఇచ్చేసింది. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కేబినెట్ వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ లోపల ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన పనులన్నీ పూర్తి అయిపోవాలని ఆదేశించింది.

అయితే క్యాబినెట్ లో మాత్రం అరకు ను మరొక జిల్లా చేయాలన్న ప్రపోజల్ కు రావడం గమనార్హం. ఆ ప్రాంతం మొదటినుండి కొత్త జిల్లాల రేసులో ఉండగా ఇప్పుడు దాని విషయమై కొంతమంది కేబినెట్లో పట్టుబట్టారు. అరకు జిల్లా ను ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల నాలుగు జిల్లాలకు చాలా అనువుగా ఉంటుందని మరియు భౌగోళికంగా అరకు చాలా పెద్ద ప్రదేశమని…. ఇంకా అక్కడ అభివృద్ధి జరిపేందుకు కూడా కావాల్సిన వనరులు మరియు సదుపాయాలు ఉన్నాయని చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ అవసరమైతే అరకు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే అవకాశం కూడా ఉందని… అటువంటి ప్రాంతాన్ని కచ్చితంగా జిల్లా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాగో పార్లమెంటులని కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి జగన్ తో సహా పలువురు మంత్రాల దీనికి సానుకూలంగా ఉన్నప్పటికీ సి స్ నేతృత్వంలోని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇందులో రాజకీయ నేతలు ఎవరూ ఈ ప్రక్రియలో వేలు పెట్టడానికి లేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ప్రతి ఒక్క నిర్ణయం కేవలం అధికారుల చేతుల్లోనే ఉంటుంది.

అయితే దీనిని ఎంత వరకు పాటిస్తారు అన్న విషయం పక్కన పెడితే.. పలువురు పట్టుబట్టినట్టు అరకు కొత్త జిల్లాల లిస్టులో ఉందా లేదా అన్న విషయం మాత్రం కొద్దిరోజులు సస్పెన్స్ గానే మిగిలిపోనుంది. అయితే చాలామంది మాత్రం ఇప్పటికే ఏపీకి మొత్తం 26 జిల్లాలోని ఫిక్స్ అయిపోయారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad