ప్రజాశక్తి, అమరావతి: కరోనా కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ నెల వేతన బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. లాక్ డౌన్ తర్వాత సర్కార్ రాబడి బాగా పడిపోయిందని, ఉన్నంతలోనే సర్దుబాటు చేస్తూ చెల్లింపులు చేస్తున్నామని చెప్పింది మార్చి, ఏప్రిల్ నెలల జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం వాయిదా వేసిందని, వాటిని చెల్లించేలా రాష్ట్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ రిటైర్డ్ జిల్లా జడ్జి డి.లక్ష్మీ కామేశ్వరి దాఖలు చేసిన పిన్ని గురువారం న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ బి.కృష్ణమోహన్ లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది ప్రభుత్వ లాయర్ చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, ఆదాయం తగ్గినా పేదల సంక్షే మానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుం టోందని, ఆ రెండు నెలల్లో జీతాల్ని వాయిదా వేశామని, త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు విచారణ శుక్రవానికి వాయిదా పడింది.






