ఇమ్యూనిటీ పెరగాలంటే ఇలా చేయండి...

బెల్లాన్ని పాలతో కలిపి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పాలు, బెల్లంలో మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బెల్లంలో ఐరన్‌, పాలలోని కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాల్షియం ఎముకలకు గట్టి బలాన్ని ఇస్తుంది. బెల్లంలోని సుక్రోజ్‌, గ్లూకోజ్‌, ఖనిజాలు ఉన్నాయి. పాలల్లో లాక్టిక్‌ యాసిడ్‌, ప్రోటీన్స్‌, కాల్షియం, విటిమన్‌-ఎ,బి,డిలు ఉండడం వల్ల ఆరోగ్య పరంగా ఇవి రెండు మంచివి. 

బెల్లం జీర్ణాశయ సంబంధిత వ్యాధులను దరి చేరనివ్వదు. బెల్లం తీసుకున్న వెంటనే జీర్ణమవుతుంది. అంతేకాక పొట్టలో గ్యాస్‌ను ఉత్పత్తి చేయదు. నిత్యం రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో చిన్న బెల్లం ముక్క వేసుకోని తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. ఆస్తామా నుంచి కాపాడుతుంది.వర్షాకాలం, శీతాకాలం అస్తమా ఉన్నవారికి అంత మంచిగా ఉండదు. కారణం వాతావరణంలో ఉండే తేమ వారికి ఊపిరి ఆడనివ్వదు. ఇలాంటి వారు తమ శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి బయటకు వెళ్ళే ముందు బెల్లం కలిపిన పాలను తీసుకోండి. మీరు తినగలిగితే నల్ల నువ్వుల్లో బెల్లం వేసి తయారు చేసిన లడ్డూలు కూడా తీసుకోవచ్చు.
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad