
అంతేకాదు, ప్రజారోగ్యానికి సంబంధించి వేగంగా స్పందించేందుకు అవసరమైన 108,104 అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అంబుల్పైన్ లో అధునాతనమైన వైద్యపరికరాలు అందుబాటులో ఉంటాయి. ప్రజారోగ్యంపై జగన్ ప్రభుత్వం చూపుతున్న శ్రద్దను ప్రశంసిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. "అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం - అభినందనీయం ..అలాగే,గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో , ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు - అభినందనీయం.." అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

