Google- Jio కొత్త ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టం


సెర్చింజన్ Google  సంస్థతో కలిసి Jio స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టంను తీసుకు రానుందని, ఇది ఆండ్రాయిడ్ ఆధారితంగా ఉంటుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల కోసం దీనిని తీసుకు వచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఆయన ఈ రోజు(జూలై 15, బుధవారం) మధ్యాహ్నం రిలయన్స్ 43వ ఏజీఎం వర్చువల్ సమావేశంలో మాట్లాడారు.అలాగే, భారత్‌లో పెరిగిన డేటా డిమాండును తట్టుకొని జియో నిలిచిందని, జియో సొంతగా 5G సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసిందని తెలిపారు. వచ్చే ఏడాది దీనికి సంబంధించి సేవలు అందుబాటులోకి రావొచ్చునని, స్పెక్ట్రం రాగానే పరీక్షిస్తామన్నారు.

5జీ స్మార్ట్ ఫోన్లు 

ప్రస్తుతం ఉన్న అందుబాటు ధరల్లోనే 5జీ స్మార్ట్ ఫోన్లు అందిస్తామని ముఖేష్ అంబానీ చెప్పారు. 2జీ ముక్త్ నినాదంతో సరికొత్త స్మార్ట్ ఫోన్లు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ఫీచర్ ఫోన్ వినియోగదారులందరికీ స్మార్ట్ ఫోన్లు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. స్పెక్ట్రం కేటాయింపులు రాగాన్ జియో 5G సేవలు అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్‌తో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. జియో 5జీ సేవలతో ఆధునిక ప్రపంచ దశ, దిశ మారనుందన్నారు. రవాణా వ్యవసాయం, వైద్యం, విద్యా రంగాల్లో జియో 5జీతో నూతన శకం ప్రారంభమవుతుందన్నారు. భారతీయ స్టార్టప్స్‌కు అత్యుత్తమ భాగస్వామిగా రిలయన్స్ జియో ఉంటుందని చెప్పారు. స్టార్టప్స్ వారి లక్ష్యాలను చేరుకునే దిశగా జియో సహకారం ఉంటుందని తెలిపారు.

అందరికీ అనుసంధానంగా జియో మార్ట్ వాట్సాప్, జియో మార్ట్ కలయిక విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని ముఖేష్ అంబానీ చెప్పారు. కొనుగోలుదారులు, ఉత్పత్తిదారులు, కిరాణా దుకాణాల అనుసంధాన వేదికగా జియో మార్ట్ ఉంటుందని చెప్పారు. జియో మార్ట్‌తో కిరాణా దుకాణాలకు ఆధునిక, సాంకేతిక సొబగులు అద్దుతామన్నారు. జియో మార్ట్‌తో 48 గంటల్లోనే సాధారణ కిరాణా దుకాణాలకు కొత్త రూపు వస్తుందన్నారు. వినియోగదారుల వంద శాతం అవసరాలు తీర్చేలా జియో మార్ట్ కిరాణా దుకాణాలు ఉంటాయని చెప్పారు. జియో మార్ట్ ద్వారా నమ్మకమైన, నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తామని చెప్పారు. జియో మార్ట్‌లో తొలి ఆర్డర్‌కు కరోనా కాంప్లిమెంటరి కిట్ ఉచితంగా అందిస్తామని తెలిపారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad