JEE NEET 2020: నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా

జేఈఈ, నీట్‌ 2020 పరీక్షలు వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతోన్న కరోనా వైరస్ తీవ్రత కారణంగా నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.

నీట్ పరీక్షను సెప్టెంబర్ 13కి వాయిదా వేయగా.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను సెప్టెంబర్ 27కి వాయిదా వేసింది. అలాగే సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

భారత్‌లో కరోనా కేసుల పెరుగుతోన్న నేపథ్యంలో చాలా విద్యాసంస్థలు క్వారంటైన్ సెంటర్లుగా మారాయి. అందుకే ఈ పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశాలు కనిపించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

రద్దు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ట్విట్టర్‌ ద్వారా డిమాండ్లు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం స్పందించారు.

పరిస్థితిని సమీక్షించి, సిఫారసులను రేపటిలోగా సమర్పించాలని ఎన్‌టీఏ, ఇతర నిపుణులతో కూడిన కమిషన్‌ను కోరిన విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad