BANK LOAN తీసుకున్న వారికి శుభవార్త

 బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి శుభవార్త. పలు బ్యాంకులు కీలక వడ్డీ రేట్లును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో లోన్ తీసుకున్న వారికి ఈఎంఐ భారం కాస్త తగ్గనుంది. ఏకంగా మూడు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటును తగ్గించడంతో ఆ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న అనేక మందికి ప్రయోనం లభించనుంది. ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముస్లర్  రేటు తగ్గించింది. Marginal Cost of Funds Based Lending Rate (MCLR) తగ్గింపు నిర్ణయం ఆగస్ట్ 11 నుంచే అమలులోకి వచ్చింది. రేట్ల తగ్గింపుతో బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.4 శాతం నుంచి 7.25 శాతానికి దిగొచ్చింది. మూడు నెలల MCLR 6.95 శాతానికి క్షీణించింది. ఇక 6 నెలల ఎంసీఎల్ఆర్ 7.1 శాతానికి తగ్గింది. యూనియన్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు తగ్గించడం ఇది వరుసగా 14వ సారి కావడం గమనార్హం. యూనియన్ BANK మాత్రమే కాకుండా మరో బ్యాంక్ కూడా MCLR రేటును తగ్గించేసింది. 

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సైతం ఎంసీఎల్ఆర్ రేటు తగ్గించింది ఈ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఆగస్ట్ 10 నుంచే రేట్ల తగ్గింపు నిర్ణయం అమలులోకి వచ్చింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.75 శాతం నుంచి 7.65 శాతానికి దిగొచ్చింది. మరో బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్ రేటును తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర కూడా ఎంసీఎల్ఆర్ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.4 శాతానికి క్షీణించింది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad