కరోనా వ్యాక్సిన్ ను రెడీ చేసిన రష్యా

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ పై  పోరాటానికి వ్యాక్సిన్‌ను రష్యా సిద్ధం చేసింది. గామాలేయా ఇన్‌స్టిట్యూట్‌ చేపట్టిన వ్యాక్సిన్‌ ప్రక్రియ దాదా పు పూర్తయింది. మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ ముగిశాయి. వ్యాక్సిన్‌ వినియోగానికి సంబంధించి అధికారిక అనుమతుల ప్రక్రియ మాత్రమే మిగిలింది. వారం పది రోజుల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖైల్‌ మురష్కో అధికారికంగా చెప్పారు. అక్టోబర్‌లో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మొదట డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, టీచర్లకు టీకాను అందించాలనే ప్రతిపాదన ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆగస్టులో పూర్తవుతుందని, ఆ వెంటనే పౌరులకు టీకా అందుబాటులోకి వస్తుందని తెలిపాయి. మరో రెండు ఔషధాలు క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకున్నాయని మిఖైల్‌ వివరించారు. రెండు నెలల్లో వీటికి క్లినికల్‌ అనుమతులు జారీచేస్తామని తెలిపారు. ఆగస్టు 10-12 తేదీల నాటికి వ్యాక్సిన్‌ రెడీ అవుతుందని రష్యా ఇదివరకే ప్రకటించింది. చెప్పినట్లుగానే ఈ ప్రక్రియను వేగంగా పూర్తిచేసింది. తద్వారా, ప్రపంచంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేసిన మొట్టమొదటి దేశంగా రికార్డు సృష్టించబోతున్నది. గామాలేయా ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ ప్రత్యక్ష పెట్టుబడుల నిధి సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ తయారీని చేపట్టాయి. కాగా, నిబంధనల ప్రకారం పూర్తి విధివిధానాలకు లోబడి వ్యాక్సిన్‌ తయారీ ఉంటుందని, పరిశోధనల వ్యవధిని ఉద్దేశపూరితంగా తగ్గించడం జరగదని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad