ఇలా చేస్తే బరువు తగ్గడంతో పాటు గుండె కూడా భద్రంగా ఉంటుంది..

ప్రపంచంలో అత్యధికమంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అధిక బరువు ఉండటం శరీరానికే కాదు, గుండెకు కూడా మంచిది కాదు. ఊబకాయం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా గుండెకు రక్తసరఫరా సాఫీగా జరగదు. పైగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడంతో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఊబకాయంతో బాధపడేవారు తప్పనిసరిగా బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.రోజు సైక్లింగ్, వాకింగ్ తో పాటుగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. దీంతో పాటు ఆహారంలో ద్రాక్ష, యాపిల్, బీన్స్, జామ, ఓట్స్, సబ్జా గింజలు, బ్లాక్ బెర్రీ, డ్రైఫ్రూట్స్, సొయా, పుట్టగొడుగులు, మొక్కజొన్న, బార్లీ వంటివి తీసుకోవాలి.రోజువారీ ఆహారంలో వీటిని తీసుకోవడం వలన ఈజీగా బరువుతగ్గొచ్చు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad