టీచర్ల బదిలీలపై విద్యాశాఖ కసరత్తు

 సీఎం ఆమోదానికి ఫైల్ ... ఖాళీల ప్రకారం బదిలీలు

✰ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి విద్యాశాఖ ప్రభుత్వ ఆమోదానికి దస్త్రం (ఫైలు)ను పంపింది.

✰ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బది లీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు.

✰  వెబ్ కౌన్సెలింగ్  ద్వారా ఈ బదిలీలు చేపట్టనున్నారు. టీచర్లకు స్కూళ్ల ఎంపిక ఆప్షన్ల నమోదు నుంచి బదిలీ ఉత్తర్వులు జారీ వరకు పూర్తి ప్రక్రియలను ఆన్లైన్లోనే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇక బదిలీలకుసంబంధించిక్షేత్రస్థాయిలో అనేక అంశాలపై నిర్ణయాలు చేపట్టాల్సి ఉన్నందున ముందుగా అందుకు సంబం ధించిన కసరత్తును అధికారులు చేపట్టారు.

✰  ఖాళీల వివరాలతో పాటు ఇతర అంశాలను సేకరించి సిద్ధం చేసుకోవాలని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు.

✰ ఇప్పటికే ఇందుకు సంబంధించి మండల స్థాయి నుంచి వివరాల సేకరణ ప్రక్రియను చేపట్టారు. హేతుబద్దీకరణ, తప్పనిసరి బదిలీ, పదోన్నతి రాజీనామా, పదవీ విరమణతో అయ్యే ఖాళీల జాబితాలను పంపించాలని విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు .

✰ అనధికారిక సెలవు, గైర్హాజరులో ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భాళీలుగా చూపించాలని పేర్కొంది.

✰ సస్పెన్షన్లో ఉన్న వారి ఖాళీలను పరిగణనలోకి తీసుకోరాదని వివరించిందిమరోవైపు ఆయా జిల్లాల విద్యాధికారులు ఇందుకు అనుగుణంగా వివరాలు సేకరణ చేపట్టారు.

✰ U DISE   కోడ్ ప్రామాణికంగా పాటశాలల్లోని ఖాళీలల వివరాలను పరిగణనలోకితీసుకోవాలి.

✰ ఆయా ఖాళీల సమాచారానికి కోడ్ జాగ్రత్తగా నమోదు చేయాలి.

✰ HRA అనుసరించి నాలుగు కేటగిరీలుగా స్కూళ్లను చూపించాలి.

✰ ప్రభుత్వ, ఎంపీపీ, జెడ్పీ స్కూల్ వివరాలు మాత్రమే నమోదు చేయాలి.

✰ సెప్టెంబర్ 1 నాటికి ఉండే ఖాళీల సంఖ్యను పరి గణనలోకి తీసుకోవాలి భాషా పండితుల (లాంగ్వేజ్ పండిట్) పోస్టులుస్కూల్ అసిస్టెంటు (లాంగ్వేజ్)గా అప్ గ్రేడ్ అయినందున వాటిని ఎస్పీగా పేర్కొనకూడదు. 

✰ 2015 నవంబర్ 18వ తేదీ కన్నాముందు తేదీల నుంచి ప్రస్తుత పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధా ఉపాధ్యాయులు, టీచర్ వివరాలు సమర్పించాలి 

✰ 1970 సెప్టెంబర్ 1 తరువాత పుట్టిన పురుష ఉపాధ్యాయులు బాలికల హైస్కూళ్లలో పనిచే స్తుంటే వారి వివరాలు ఇవ్వాలి

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad