D.Ed కోర్సు రద్దు.. డిగ్రీ విద్యార్థులకు రెండేళ్ల బీఈడీ కోర్సు

ఉపాధ్యాయ విద్యలో భారీ ఎత్తున సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాలుగేళ్ళ బీఈడీ కోర్సును పూర్తిచేసిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని ప్రతిపాదించింది. ఇప్పుడున్న బీఈడీ కోర్సును మరింత పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. నూతన విద్యా విధానంలో భాగంగా ఇంటర్మీడియట్ అర్హతతో డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సును రద్దుచేసి ఆ స్థానంలో నాలుగేళ్ళ వ్యవధిగల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సును ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. డిగ్రీ అర్హతతో ప్రస్తుతమున్న రెండేళ్ళ బీఈడీ కోర్సు యధావిధిగా కొనసాగనుంది. బీఈడీ తర్వాత మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఈడీ) కోర్సు వ్యవధిని రెండేళ్ళ నుంచి ఏడాదికి కుదించాలని నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన నూతన విద్యావిధానంలో భాగంగా ఉపాధ్యాయ విద్యలో మార్పులు తీసుకువచ్చి విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో పటిష్టపరచాలని నిర్ణయించింది. కొత్త విధానంలో ఇంటర్ తర్వాత నాలుగేళ్ళ, డిగ్రీ తర్వాత రెండేళ్ళ వ్యవధిగల బీఈడీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.టీచర్ కావాలంటే ఇంటిగ్రేటెడ్ బీఈడీ తప్పని సరి.దేశంలో 2030 విద్యా సంవత్సరం నాటికి పాఠశాల విద్యాబోధనకు కనీస అర్హతగా నాలుగేళ్ళ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషను అమల్లోకి తీసుకురావాలని నూతన విద్యా విధానం స్పష్టంగా పేర్కొంది. నాలుగేళ్ళ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులను నిర్వహించే కళాశాలల్లో మాత్రమే రెండేళ్ళ బీఈడీ కోర్సును అందించాలని నిర్ణయించింది. రెండేళ్ళ బీఈడీ కోర్సును పూర్తిచేసిన వారు మరో రెండేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ బీఈడీని చదివేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad