Mutual Funds..ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్లలో 50 లక్షలు

 డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రిస్క్ తీసుకుంటారా? లేదా? అనే అంశంపై ఆధారపడి మీకు వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. రిస్క్ తీసుకుంటే అధిక రాబడి పొందొచ్చు. అదే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదంటే ఆకర్షణీయ రాబడి లభిస్తుంది. రిస్క్ తీసుకోని వారు బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో డబ్బులు దాచుకోవచ్చు. బ్యాంకుల్లో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయొచ్చు. లేదంటే పోస్టాఫీస్ అందించే స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైతే మాత్రం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో డబ్బులు పెట్టొచ్చు. ఈక్విటీ మార్కెట్‌లో డైరెక్ట్‌గా డబ్బులు పెట్టడం తెలియని వారు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు.

మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఈక్విటీ ఫండ్స్‌లో డబ్బులు పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెలితే ప్రయోజనం లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.50 లక్షలకు పైగా సంపాదించాలని భావిస్తే మాత్రం.. అప్పుడు నెలకు ఏకంగా రూ.78 వేలు సిప్ చేయాల్సి ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు వారి డబ్బులో సగాన్ని అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్‌లో మరో 50 శాతం డబ్బును కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు.

Top Post Ad

Below Post Ad