ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది... అయినా, రోజువారీ కేసుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 7,956 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 60 మంది మృతిచెందారు..
దీంతో.. ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,75,079కు పెరిగింది.. ఇప్పటి వరకు కరోనాతో 4,972 మంది మృతిచెందారు. ఇక, కరోనాబారినపడిన 4,76,903 మంది ఇప్పటి వరకు రికవరీ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 93,204గా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. మరోవైపు.. గత 24 గంటల్లో 61,259 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..
ఇప్పటి వరకు ఏపీలో నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 46,61,355కు చేరింది.