ఏపీలో కేసులు తగ్గుతున్నాయి.. కానీ కొత్త ప్రాంతాల్లో కేసులు !

గత రెండు వారాలుగా పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు వస్తున్నాయన్న ఆయన కేసులు తగ్గుతున్న కొత్త ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయని అన్నారు. ఆగస్టులో కంటే సెప్టెంబర్ లో టెస్ట్ లు పెరిగాయని అన్నారు. సెప్టెంబర్ లో టెస్ట్ లు పెరిగినప్పటికి పాజిటివ్ కేసులు తగ్గాయని అన్నారు. ఆగస్టులో రోజుకి 91 మరణాలు ఉన్నాయని, సెప్టెంబర్ లో రోజు కి 51 మరణాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో చాలా జిల్లాలో పాజిటివ్ రేటు తగ్గిందన్న ఆయన గత వారం నుండి 60 శాతం కేసులు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చాయని అన్నారు.

40 శాతం కేసులు పట్టణ ప్రాంతాల్లో వచ్చాయన్న అయన 58 శాతం మరణాలు గ్రామీణ ప్రాంతాల్లో నమోదువుతున్నాయని అన్నారు. 42 శాతం మరణాలు పట్టణ ప్రాంతాల్లో నమోదవుతున్నాయని, గత వారంలో కొత్తగా 5440 క్లస్టర్స్ వచ్చాయని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్కువ ఫీజులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్న ఆయన అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఆధారాలు మాకు పంపించండి తక్షణం ఆ ఆసుపత్రిని సీజ్ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో అధిక ఫీజులను వసూలు చేసిన 25 ప్రవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నామన్న ఆయన ప్రభుత్వం ఆదేశాలను అన్ని ప్రవేట్ ఆసుపత్రులు పాటించాలని అన్నారు. 


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad