కరోనా సమయంలోనూ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఇదే సమయంలో యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంది.. అయితే, కోవిడ్ కారణంగా అక్టోబర్ 4వ తేదీన జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. కరోనా తగ్గుముఖం పట్టే వరకు రెండు నుంచి మూడు నెలలపాటు ఈ పరీక్షలను వాయిదా వేయాలని పిటిషన్‌లో కోరారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టింది జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం..
అయితే, పిటిషనర్ వాదనపై యూపీఎస్‌సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్టోబరు 4వ తేదీన పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది... ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. అక్టోబరు 4న జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేసేందుకు నిరాకరిస్తూ తీర్పు వెలువరించింది. 2020, 2021 సివిల్ సర్వీసెస్ పరీక్షలను కలిపేయాలన్న వాదనను కూడా తోసిపుచ్చింది సుప్రీంకోర్టు.
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని యూపీఎస్సీ మరోసారి స్పష్టం చేసింది.
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని యూపీఎస్సీ మరోసారి స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీనే పరీక్ష జరుగుతుందని తెలిపింది. ఈమేరకు యూపీఎస్సీ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేస్తే ఆ ప్రభావం వచ్చ ఏడాది జూన్ 27న జరిగే పరీక్షపై పడుతుందని పేర్కొంది.
పరీక్షకు హాజరయ్యే వారంతా పట్టభద్రులు, ఉన్నత విద్యావంతులే అని.. వీళ్లంతా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించింది. కరోనా నిబంధనలను పరిగణలోకి తీసుకునే అన్నీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఈ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల కోసం రూ.50.30 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.
షెడ్యూల్ ప్రకారం యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 4న జరగాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం.. వివిధ రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో పరీక్షను రెండు నుంచి మూడు నెలలపాటు వాయిదా వేయాలని 20 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కరోనా మహమ్మారిని నిలువరించడానికి దేశంలో లాక్‌డౌన్ విధించడంతో మే 31న జరగాల్సిన ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపడింది. అనంతరం జూన్ 6న సవరించిన పరీక్షల తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 4న ప్రిలిమ్స్ జరుగుతుందని వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను యూపీఎస్సీ ఇప్పటికే విడుదల చేసింది.