Google Play store నుంచి PAYTM యాప్ తొలగింపు

 పేటీఎం యాప్ తొలగింపు.. మరి మీ డబ్బుల సంగతేంటి?

గూగుల్ తాజగా పేటీఎంకు భారీ షాకిచ్చింది. యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. దీనికి పేటీఎం యాప్ గూగుల్ ప్లేస్టోర్ రూల్స్‌ను అతిక్రమించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎంకు భారీ షాకిచ్చింది. ఒక్కదెబ్బతో పేటీఎంను కనిపించకుండా చేసింది. అంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. దీనికి కూడా ఒక ప్రధాన కారణంగా ఉంది. గ్యాంబ్లింగ్ యాప్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై ప్రోత్సహించమని గూగుల్ స్పష్టం చేసింది. అందుకే గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించినట్లు స్పష్టం చేసింది.

గూగుల్ తన బ్లాగ్‌లో ఇండియాలో గ్యాంబ్లింగ్ పాలసీపై ఒక పోస్ట్ చేసింది. ఇందులో గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన విషయాలను హైలైట్ చేసింది. ‘తమ కస్టమర్లకు సురక్షితమైన సేవలు అందిస్తాం. అలాగే డెవలపర్లకు స్థిరమైన వ్యాపారాలకు ప్లాట్‌ఫామ్‌ను అందిస్తున్నా. వాటాదారులందరికీ ప్రయోజనం కలిగే నిర్ణయాలు తీసుకుంటాం’ అని గూగుల్ తెలిపింది.

యాప్‌లో అందుబాటులో ఉన్న క్యాసినో గురించి మాట్లాడుతూ.. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ) సుజనే ఫ్రేయ్ తాము ఆన్‌లైన్ క్యాసినోను అనుమతించం. అలాగే ఇతర గ్యాంబ్లింగ్ యాప్స్‌ను ప్రోత్సహించం. స్పోర్ట్స్ బెట్టింగ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. అంటే ఒక యాప్ కస్టమర్లను వేరొక వెబ్‌సైట్‌కు తీసుకెళ్తే అక్కడ టోర్నమెంట్‌లో పాల్గొని క్యాష్ ప్రైజ్, మనీ గెలుచుకోవడం చేస్తుంటారు. ఇది కూడా తమ పాలసీలకు వ్యతిరేకం అని వివరించారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad