కరోనా ఈ 5 మార్గాల్లోనే ఎక్కువగా వ్యాపిస్తోంది : కొత్త కాంటాక్ట్ ట్రేసింగ్ డేటా

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కొన్ని ప్రత్యేకమైన మార్గాల్లో వ్యాపిస్తోందని కొత్త కాంటాక్ట్ ట్రేసింగ్ డేటా (new contact tracing data) ఒకటి వెల్లడించింది. కరోనా బారినపడిన వారిలో 70 శాతానికిపైగా వ్యాప్తి  చెందదు. కానీ, మైనారిటీ కేసులే సూపర్ స్ప్రెడర్ లుగా మారుతున్నాయని భారతదేశంలో SARS-CoV2 transmission నమూనాల మొదటి వివరణాత్మక అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనంలో చిన్నారులే గతంలో కంటే వైరస్ వ్యాప్తిలో పెద్ద పాత్ర పోషించారని, నిరంతరం ప్రయాణాలు చేసేవారి ద్వారా వైరస్ వ్యాప్తి హైరిస్క్ ఎక్కువగా ఉంటుందని డేటా సూచించింది.


వాషింగ్టన్ కేంద్రంగా సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ డైరెక్టర్ రమణన్ లక్ష్మీనారాయణన్ నేతృత్వంలోని పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కరోనా ప్రారంభం నుండి ఆగస్టు 1 వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పూర్తి కాంటాక్ట్ ట్రేసింగ్ డేటాను సేకరించి అధ్యయనం చేశారు. మొత్తం మీద, ఆగస్టు 1 నాటికి రెండు రాష్ట్రాలు 435,000 కేసులు నమోదు కాగా.. మూడు మిలియన్లకు పైగా చేరుకున్నాయి. 84,965 పాజిటివ్ కేసులలో 575,071 మంది కాంటాక్టుల కోసం పరిశోధకులు పూర్తి ఎపిడెమియోలాజికల్ డేటా ల్యాబరేటరీ ఫలితాలను సేకరించారు. సెప్టెంబర్ 30న సైన్స్ మ్యాగజైన్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు.

1.సూపర్ స్ర్పైండింగ్ అంటే:

కాంటాక్టుల ద్వారా పాజిటివ్ కేసులు మైనారిటీ కేసులలోనే ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. 70శాతం పైగా ఇండెక్స్ కేసులు ప్రాధమిక కేసులు టెస్టుల ద్వారా గుర్తించారు. 10శాతం కంటే తక్కువ ఇండెక్స్ కేసులు దాదాపు 60శాతం ఇన్ఫెక్షన్లకు కారణమయ్యాయి. సూపర్‌స్ప్రెడింగ్ అంటే కొంతమంది ఇతర వ్యక్తుల కంటే చాలా ఎక్కువ వైరస్ వ్యాప్తి చేస్తారని రమణన్ లక్ష్మీనారాయణన్ అభిప్రాయపడ్డారు.

ఈ అధ్యయనం ప్రకారం.. సూపర్ స్ప్రెండింగ్ అంటే.. కరోనా బాధిత వ్యక్తి ఎక్కువగా సామాజికంగా అందరితో కలవడం లేదా పెద్ద సంఖ్యలో ప్రజలతో మమేకం అవకాశం ఉన్న వ్యక్తిగా చెప్పవచ్చు. డేటా నుంచి మొదటి 24 గంటలలోపు అన్ని కేసులను గుర్తించి వేరుచేయగలిగితే ప్రసారాన్ని 70శాతం తగ్గించగలమని గుర్తించామని సహ రచయిత మోహన్ అన్నారు.

2. ఎక్కువ దూర ప్రయాణాలే అధిక ముప్పు :

వైరస్ కాంటాక్టులను అధ్యయనం రెండు విభాగాలుగా వర్గీకరించింది. ఒకటి హై రిస్క్ రెండోది లో రిస్క్.. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తే… ఒక మీటర్ కంటే తక్కువ దూరం ఉండి.. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఉండి ట్రావెల్ చేసినప్పుడు.. అది కూడా ఇండెక్స్ కేసులో మూడు వరుసల సీట్లలోనే ప్రయాణిస్తే మాత్రం అది హైరిస్క్ కాంటాక్టులుగా చెప్పవచ్చు.ఇలాంటి కాంటాక్టుల్లో 10 శాతం ఇండెక్స్ కేసులు పాజిటివ్ నిర్ధారణ అయిందని పేర్కొంది. అంటే వీరిలో పదిమందిలో ఒకరు కచ్చితంగా కరోనా సోకే ప్రమాదం ఉందని నిర్ధారించారు. ఒకే స్థలంలో ఉండి ఎవరితోనూ కలవకుండా ఉన్నవారిలో లో రిస్క్ ఉంటుందని వీరిలో 5 శాతం మాత్రమే పాజిటివ్ వచ్చిందని పేర్కొంది.

3. చిన్నారుల్లో వ్యాప్తిపై తక్కువ అంచనా వేయడం :

20ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయస్సు వారిలో కరోనా ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకే అవకాశం ఉందని అధ్యయనం వెల్లడించింది. చిన్నారుల నుంచి పెద్దలకు ఒకరినొకరికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ్ తెలిపారు. ఎందుకంటే పిల్లల్లో దాదాపు ఇన్ఫెక్షన్లు చాలా స్వల్పంగా ఉంటాయని వైరస్ సోకిన విషయాన్ని నిర్ధారించే అవకాశమే ఉండదు.. ఒకే వయస్సు ఉన్న కాంటాక్టుల్లో వైరస్ వ్యాప్తి ముప్పు ఎక్కువగా ఉందని అధ్యయనం గుర్తించింది. పిల్లలలో ఇది ప్రత్యేకమని పేర్కొంది. 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మధ్య వైరస్ వ్యాప్తి అత్యధికంగా ఉందని వెల్లడించింది.

4. భారత్‌లో వృద్ధుల మరణాలు తక్కువే :

రెండు రాష్ట్రాల కోవిడ్ కేసులు ఊహించిన దానికంటే తక్కువగా ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. విదేశాలతో పోల్చితే భారతదేశంలో తక్కువ సగటు వయస్సు ఉండటం ఆశ్చర్యకరమని పరిశోధకులు తెలిపారు. అమెరికాలో 40-49 సంవత్సరాల వయస్సులో గరిష్ట స్థాయికి చేరుకుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వృద్ధాప్యంలో మరణాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. సుమారు 75ఏళ్ల వయస్సులోనే కనిపించింది.

అమెరికా మాదిరిగా కాకుండా వృద్ధులలో మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని ఊహించని విషయమని నిపుణులు తెలిపారు. వృద్ధాప్యంలో మెరుగైన ఆరోగ్యం కొమొర్బిడిటీలు లేనివారే ఎక్కువగా ఉండటంతో ఊహించిన దానికంటే తక్కువ కోవిడ్ మరణాలు ఉండొచ్చునని అధ్యయనం పేర్కొంది.

5. అమెరికాలో కంటే కరోనా మరణాల సమయం తక్కువ :

చనిపోయే ముందు వ్యక్తి పాజిటివ్ తేలిన వ్యక్తి.. సగం కేసులలో, టెస్టుకు, వ్యక్తి మరణానికి మధ్య కేవలం ఆరు లేదా అంతకంటే తక్కువ రోజులు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో మరణించే సగటు సమయం యుఎస్ కంటే చాలా తక్కువగా ఉంది.

ఆస్పత్రిలో చేరిన తేదీ నుంచి 13 రోజులు సమయంగా చెప్పవచ్చు. చైనాలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. కరోనా లక్షణాల ప్రారంభం నుండి రెండు నుండి 8 వారాల మధ్య ఉంటుంది. మరణానికి తక్కువ సమయం భారతదేశంలో సంరక్షణకు యాక్సస్ లేకపోవడాన్ని ఎత్తిచూపుతోంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad