Amazon ద్వారా రైలు టిక్కెట్ బుక్ చేయండి ఇలా...: First Booking ‌పై క్యాష్ బ్యాక్

 ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ఇండియన్ రైల్వేస్ IRCTCతో జత కట్టింది. రైలు టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు అమెజాన్ బుకింగ్ ఫీచర్‌ను ప్రారంభించింది. యూజర్లు అమెజాన్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్స్ ద్వారా రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు, యూజర్లు పీఎన్ఆర్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. అమెజాన్ ద్వారా మొదటిసారి రైలు టిక్కెట్లు బుక్ చేసేవారు రూ.100 వరకు క్యాష్ బ్యాక్ పొందుతారు. ఈ మేరకు అమెజాన్ తెలిపింది.

12 శాతం క్యాష్ బ్యాక్:

 అమెజాన్ ప్రైమ్ సభ్యులు తమ మొదటి బుకింగ్ పైన 12 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇతరులు 10 శాతం క్యాష్ బ్యాక్ పొందుతారు. పరిమిత కాలానికి సర్వీస్, పేమెంట్ గేట్ వే ట్రాన్సాక్షన్ ఛార్జీలను కూడా మాఫీ చేసింది. అయితే అమెజాన్ పే వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. అమెజాన్ గత ఏడాది విమానం, బస్సు టిక్కెట్ బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఇప్పుడు రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

టిక్కెట్ ఎలా బుక్ చేసుకోవాలి? 

అమెజాన్ పే-ట్యాబ్‌కు వెళ్లి, ఆ తర్వాత రైళ్ళు లేదా కేటగిరీని ఎంచుకొని టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. ఇతర ట్రావెల్ బుకింగ్ పోర్టల్ మాదిరిగా కస్టమర్లు తమ గమ్యస్థానాలు, ప్రయాణ తేదీలను సెలక్ట్ చేసుకోవచ్చు. అమెజాన్ పే లేదా ఇతర డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చెల్లింపు సిస్టంను ఎంచుకునే వెసులుబాటు ఉంది. టిక్కెట్ బుక్ తర్వాత పీఎన్ఆర్ నెంబర్, సీటు వంటి వివరాలు చెక్ చేసుకోవచ్చు. టిక్కెట్ క్యాన్సిలేషన్ పైన తక్షణమే నగదు వాపస్ అందిస్తుంది. - అమెజాన్ యాప్‌‍లోకి వెళ్లి ఆఫర్స్ పైన క్లిక్ చేయాలి. తర్వాత IRCTC ఆప్షన్ ఎంచుకోవాలి. బుక్ నౌ పైన క్లిక్ చేయాలి. తర్వాత ప్రయాణం, రైలు, పాసింజర్ వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత చెల్లింపులు జరపాలి. వెంటనే క్యాష్ బ్యాక్ మీ ఖాతాలో క్రెడిట్ అవుతుంది. యువర్ ఆర్డర్స్ సెక్షన్‌లోనే టిక్కెట్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు.

24x7 సేవల్ హెల్ప్ లైన్:

 అమెజాన్ పే లేదా ఇతర డిజిటల్ చెల్లింపులు వేగవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అమెజాన్ హెల్ప్ లైన్ ద్వారా 24x7 సహాయం పొందవచ్చు. అమెజాన్ 2019లో విమాన టిక్కెట్ల బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఈ ఈ-కామర్స్ దిగ్గజం ట్రావెల్ వెబ్ సైట్, క్లియర్ ట్రిప్స్‌తోను భాగస్వామ్యం కుదుర్చుకుంది. అమెజాన్ యాప్‌లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad