ఉపాధ్యాయులకు శుభవార్త - బదిలీలకు ముఖ్యమంత్రిగారు గ్రీన్ సిగ్నల్

అమరావతి:ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బదిలీలకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం  తెలుపుతూ సంబంధిత ఫైలుపై  సీఎం జగన్  సంతకం చేశారు. 2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని తెలిపింది. 29-2-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులని వెల్లడించింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీల కార్యక్రమం చేపట్టనుంది. మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న  ఉపాధ్యాయులందరికీ ముఖ్యమంత్రి జగన్ బదిలీలకు అవకాశం కల్పించారు.-- Source: Andhrajyothi

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad