ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

 ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. ఇప్పటికే రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.  గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా  4,256 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 723512 కేసులు నమోదయ్యాయి.  ఇందులో 51060 కేసులు యాక్టివ్ గా ఉంటె, 666433 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటలలో ఏపీలో కొత్తగా 38 కరోనా మరణాలు సంభవించాయి.  దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 6019కి చేరింది. 

ఇక ఏపీలోని జిల్లాల్లో నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.  

అనంతపూర్ లో 271, 

చిత్తూరులో 224, 

తూర్పు గోదావరి జిల్లాలో 853, 

గుంటూరులో 444, 

కడపలో 231, 

కృష్ణా జిల్లాలో 179, 

కర్నూలులో 86, 

నెల్లూరులో 365, 

ప్రకాశంలో 666, 

శ్రీకాకుళంలో 157, 

విశాఖపట్నంలో 138, 

విజయనగరంలో 129, 

పశ్చిమ గోదావరిలో 513 కేసులు నమోదయ్యాయి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad