లోన్స్ తీసుకున్నవారికి శుభవార్త చెప్పిన కేంద్రం...వడ్డీ మీద వడ్డీ మాఫీ

రూ.2 కోట్ల వరకు రుణాలకు వర్తింపు 

మారటోరియం కాలానికి రుణగ్రహీతలకు ఊరట

సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ 

న్యూఢిల్లీ, అక్టోబరు 3: మధ్య తరగతి ప్రజానీకానికి, చిన్న- మధ్యతరహా వ్యాపారులకు కొంతమేర ఊరట కలిగించే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. మారటోరియం కాలానికి (అంటే మార్చి1 నుంచి ఆగస్టు 31దాకా) రుణాలపై  వారు చెల్లించాల్సిన వడ్డీపై వడ్డీని(చక్రవడ్డీని) మాఫీ చేయడానికి అంగీకరించింది. రూ.2 కోట్ల దాకా ఉన్న రుణాలకు ఇది వర్తిస్తుందని, అంతకు పైబడ్డ వాటికి అంగీకరించే ప్రశ్న లేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన ఓ అఫిడవిట్‌లో  తెలిపింది. గృహ, విద్యా, వినియోగ వస్తువుల కోసం చేసిన రుణాలు, క్రెడిట్‌ కార్డ్‌ బకాయిలు, ఆటో రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఎంఎ్‌సఎంఈలు తీసుకున్నవి, వినియోగ రుణాలు.. మొదలైనవి రూ.2 కోట్ల లోపు ఉంటే వాటిపై వసూలు చేయదలిచిన వడ్డీపై వడ్డీని రద్దు చేస్తా రు. దీని  వల్ల కోట్లాది రుణగ్రహీతలు కొంతవరకూ లాభపడతారని కేంద్రం పేర్కొంది. కొవిడ్‌ ఉధృతి కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ ప్రజానీకానికి కేంద్రం ఈ మార్చి లో కాస్త వెసులుబాటునిస్తూ ఈఎంఐలు కట్టకుండా ప్రస్తుతానికి వాయిదా వేయవచ్చనీ, అ యితే మళ్లీ పరిస్థితులు చక్కబడ్డాక- రుణాలపై వసూలు చేసే వడ్డీకి చక్రవడ్డీ చెల్లించాల్సి ఉంటుందనీ స్పష్టం చేసింది. ఈ మేరకు మార్చి 27న రిజర్వ్‌బ్యాంకు ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇది అనేకమందికి తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఈ మాత్రం దానికి వాయిదా మాత్రం ఎందుకని భావించి వేలాది మంది తాము తీసుకున్న అప్పులకు ఈఎంఐలను యథాతథంగా కట్టేస్తూ వచ్చారు.

ఆర్‌బీఐ వెలువరించిన నోటిఫికేషన్‌ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఆగ్రాకు చెం దిన గజేంద్ర శర్మ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ వేశా రు. ‘నేను బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాను. కొవిడ్‌ వల్ల నా ఉద్యోగం పోయింది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈఎంఐలు కట్టలేని పరిస్థితి. మారటోరియం కాలానికి చక్రవడ్డీ వసూలు చేస్తామనడం వల్ల నాకు మరింత ఇబ్బంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కుకు భం గం కలిగించడమే’ అని పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం పిటిషనర్‌ వాదనలో కొంత న్యాయం ఉందని అభిప్రాయపడింది. ‘‘రుణాల చెల్లింపును వాయిదా వేయొచ్చన్నారు. ఈ వాయిదా వేసిన కాలానికి (మారటోరియం కాలానికి) చక్రవడ్డీ వసూలు చేస్తామనడం అసంబద్ధం. మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి ప్రజలకు ఈ ఊరటనివ్వాలని భావించారో ఆ ప్రయోజనం నెరవేరట్లేదు’’ అని బెంచ్‌ గతంలో పేర్కొంది.

దీనిపై పరిశీలించి కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఓ నిపుణుల కమిటీ వేసి పరిశీలిస్తామని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అప్పట్లో హామీ ఇచ్చా రు. దీనిపై కేంద్రం ఆర్‌బీఐని సంప్రదించినపుడు- అసలే బ్యాంకుల పరిస్థితి అంతంత మాత్రమని, రూ.వేల కోట్ల మేర మాఫీని ప్రకటించి- బ్యాంకులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టలేమని తేల్చిచెప్పింది. అంతగా కష్టమైతే-ఈ చక్రవడ్డీని ఫండెడ్‌ ఇంట్రెస్ట్‌ టర్మ్‌లోన్‌(ఎఫ్‌ఐటీఎల్‌)గా మార్చుకొని వచ్చే ఏడాది మార్చి 31లోగా రుణ గ్రహీతలు చెల్లించుకోవచ్చని సలహా ఇచ్చింది. అయితే కోర్టు ఈ సూచనకూ ఒప్పుకోలేదు. దీంతో కేంద్రం  మాజీ కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ రాజీవ్‌ మెహ్రిషి నేతృత్వంలో కమిటీ వేసింది. ఈ  కమిటీ సిఫారసుల మేరకు ప్రభు త్వం తన వైఖరిని మార్చుకుంది. 

కేంద్రం ఏమందంటే....

మారటోరియం ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు అందించాలంటే ఈ మేరకు వడ్డీ భారాన్ని భరించడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయాన్ని కేంద్రం ఎట్టకేలకు వ్యక్తం చేసింది. వడ్డీ మాఫీకి అవసరమైన నిధుల కేటాయింపు కోసం పార్లమెంట్‌ అనుమతి తీసుకోనున్నట్టు తెలిపింది. రుణగ్రహీతలు తాత్కాలిక మారటోరియం పొందారా లేదా అనే దానితో సంబంధం లేకుండా వడ్డీ మాఫీ ఉపశమనాన్ని కల్పించనున్నట్టు పేర్కొంది. ఈ మాఫీ వల్ల చాలా ఆర్థిక భారం ఉంటుందని, డిపాజిటర్లపై ఆర్థిక భారం మోపకుండా లేదా నికర వి లువపై ప్రతికూల ప్రభావం పడకుండా బ్యాంకులు ఈ భారాన్ని భరించడం అసాధ్యమని తాజా అఫిడవిట్‌లో కేం ద్రం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరించడమే ఏకైక పరిష్కారమని నిర్ణయించినట్టు పేర్కొంది. మాఫీతో రూ.6 లక్షల కోట్ల భారం పడుతుందని, ఇది అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వానికి తలకు మించిన భారమవుతుందని, బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. అందువల్లే కొన్ని రకాల రుణాలు.. అందులోనూ రూ.2 కోట్ల వరకు గల రుణాలకు మాత్రమే వడ్డీపై వడ్డీ మాఫీ చేయాలని నిర్ణయించినట్టు కేంద్రం తెలిపింది. 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad