Meeting Minutes with Unions on Transfers 2020 on 16.10.2020

 ఉపాధ్యాయ సంఘాలతో నేడు జరిగిన సమావేశంలోని అంశాలు:

** ఎస్ జి టి లకు యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించమని కోరగా, ఈ విషయంపై తప్పనిసరిగా పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు.

** చైల్డ్ ఇన్ఫో నందు ఉన్న రోలు ఉన్న వ్యత్యాసాన్ని హెచ్ఎం ల డిక్లరేషన్ ను  పరిశీలించి తగు విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

** పీఈటీ, పండిట్ తదితర పదోన్నతుల స్థానాలను వేకెన్సీ లుగా చూపుటకు లీగల్ ఇష్యూ ఉన్న కారణంగా ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉత్తర్వులు ఇస్తామని తెలియజేశారు.

** సర్వీస్ పాయింట్ లను 0.5 నుండి 1 పెంచమని కోరగా సర్వీస్ పాయింట్ లను పెంచలేమని తెలియజేశారు.

** కేటగిరీల వారీగా ఖాళీలను బ్లాక్ చేయకుండా అన్ని ఖాళీలను కౌన్సిలింగ్ నందు చూపించడానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు.

** ప్రస్తుత పదోన్నతుల విషయంపై బదిలీలకు ముందు నిర్వహించడమా లేక తర్వాత నిర్వహించిడమా అనే విషయంపై స్పష్టతను ఇస్తామని తెలియజేశారు.

** పండిట్ పదోన్నతుల విషయంలో థర్డ్ మెథడాలజీ చేసినవారిని కూడా పదోన్నతికి అర్హత కల్పిస్తూ ఉత్తర్వులు ఇస్తామనీ, కానీ MA తెలుగు వారికి సంబంధించిన విషయం లీగల్ గా కోర్టులో ఉన్నందున, కోర్టు ఉత్తర్వుల తర్వాత దానిపై నిర్ణయం తీసుకోగలమని తెలిపారు.

** పదవీ విరమణకు మూడు సంవత్సరాల లోపు ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపు కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు.

పై అన్ని విషయాలపై ఉపాధ్యాయ సంఘాల నుండి తీసుకున్న సమాచారం ప్రభుత్వానికి పంపి, తగిన విధంగా ఉత్తర్వులు విడుదల చేస్తామని తెలిపారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad