Schools reopens on November 2nd in AP - CS Neelam Sahni

 అమరావతి: కరోనా లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రం మూతపడిన స్కూళ్లు, కాలేజీలో తిరిగి తెరుచుకోనున్నాయి. నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభంకానున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈమేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు.

1.  నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి.

2.  నవంబర్‌ 2 నుంచి 9,10,11/ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ,12 / ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. హాఫ్‌డే మాత్రం నిర్వహిస్తారు. 

3. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్‌ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్‌ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు. 

4. నవంబర్‌ 23 నుంచి 6,7,8  క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు. 

5. డిసెంబర్‌ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుంది

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad