అమ్మో ..బడి! 262 మంది విద్యార్థులకు, 172 మంది టీచర్లకు పాజిటివ్‌

వెంటాడుతున్న కరోనా భయం

వణికిపోతున్న తల్లిదండ్రులు

ఫలితాల్లో జాప్యంపై ఆందోళన

50 శాతం హాజరుకు టీచర్ల అభ్యర్థన 

ఎక్కువ కేసులు వస్తే సెలవులు : డీఈవో సీవీ రేణుక

 అంతంతమాత్రంగానే స్కూళ్లకు. 


ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 4: కరోనా సెకండ్‌ వేవ్‌ పొంచి ఉందన్న హెచ్చరికల మధ్య జిల్లాలోని పలువురు పాఠ శాల విద్యార్థులకు, టీచర్లకు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కల కలానికి దారితీసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు హెచ్చరిక లు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని ఆయా పాఠశాలల్లో గత పది రోజుల్లో నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల ఫలితాలు మరింత ఆందోళనకు కారణం అవుతున్నాయి. ఆ ప్రకారం జరి గిన కరోనా టెస్టుల్లో బుధవారం వరకూ వచ్చిన ఫలితాల్లో మొత్తం 2,928 మంది టీచర్లకు కొవిడ్‌ పరీక్షలు చేయగా 172 మందికి, విద్యార్థుల్లో 41,303 మందికి టెస్ట్‌లు చేయగా 262 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మరికొన్ని మండలాల నుంచి సమాచారం అందాల్సి ఉంది. శ్వాబ్‌ శాంపిల్స్‌ పరీక్షల నిమిత్తం పంపి పది రోజులు దాటినా ఫలితాలు రాకపోవడం, ఈ వ్యవధిలో పాజిటివ్‌ వున్న విద్యార్థులు, టీచర్లు పలువురికి వైరస్‌ సోకిన విషయం తెలియక పోవడంతో వారు నలుగురితో కలిసి తిరగడం వల్ల ఇతరులకు  సోకే ప్రమాదా లు తలెత్తాయని భయపడుతున్నారు. 

14 మంది విద్యార్థులకు, ఒక టీచర్‌కు...

14 మంది విద్యార్థులు, ఒక టీచరుకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో బుధవారం జిల్లాలో కలకలం రేగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అక్టోబర్‌ 14వ తేదీ నుంచి పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 28న కామ వరపుకోట మండలం ఈస్టు యడవల్లి జడ్పీ హైస్కూలులో నూ, 29న పెదవేగి మండలం కూచింపూడి జడ్పీ హైస్కూల్‌ లోనూ వీఆర్‌డీఎల్‌ పరీక్షలు నిర్వహించగా ఫలితాలు బుధ వారం వచ్చాయి. ఈస్టు యడవల్లి స్కూలులో 9, 10 తరగ తులు చదువుతున్న విద్యార్థులు 10 మందికి, కూచింపూడి స్కూలులో ఒక టీచరుతోపాటు 8, 9 తరగతులు చదువుతున్న నలుగురు విద్యార్ధులకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీరం దరినీ హోం ఐసొలేషన్‌లో స్థానిక వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచారు. అనవసరంగా పాఠశాలలను తెరిచి పిల్లలను కరోనా బారిన పడవేశారని తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో సంబంధిత విద్యార్థులు, టీచరు తమకు పాజిటివ్‌ వచ్చినట్లు తెలియక స్కూలులో తోటి వారితో కలిసి మెలిసి ఉండడం పట్ల మిగతా వారంతా వణికిపోతున్నారు. ఏలూరు రూరల్‌ మండలంలో కరోనా సోకి ఓ మహిళా ఉపాధ్యాయుని (46) మంగళవారం మృతి చెందగా, నాలుగు రోజుల క్రితం ఓ ఎయిడెడ్‌ స్కూలు హెచ్‌ఎంను కొవిడ్‌ కబళించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. 

ఉపాధ్యాయులపై కస్సు బుస్సు 

పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు కరోనా టెస్టులు చేస్తుండ డంపై పలువురు తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. టెస్ట్‌ల్లో విద్యార్థులెవరికైనా పాజిటివ్‌ నిర్ధారణ అయితే ఆ విష యాన్ని హెచ్‌ఎంలు తల్లిదండ్రులకు తెలియజేసి వైద్య సిబ్బం ది సహకారంతో వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచాలని సూచి స్తున్నారు. దీనిపై పలువురు తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ పిల్లలకు పాజిటివ్‌ సోకిన విషయాన్ని బహిరంగ పరిస్తే గ్రామాల్లో పలు సమస్యలు, వివక్షత ఎదుర్కొంటు న్నామని పేరెంట్స్‌ చెబుతున్నట్లు హెచ్‌ఎంలు అంటున్నారు. ఇక పాజిటివ్‌ నిర్ధారణ అయిన విద్యార్థులు తల్లిదండ్రులకు, సెకండరీ కాంటాక్టుకు పరీక్షలు చేయాల్సి ఉండడం ఇప్పుడు ఓ సవాల్‌గా మారింది. 

50 శాతం హాజరుకు టీచర్ల అభ్యర్థన 

విద్యార్థుల హాజరు లేనందున పాఠశాలలకు 50 శాతం మంది టీచర్లు వచ్చేలా సూచనలు చేయాలని ఉపాధ్యాయులు అభ్యర్థిస్తున్నారు. ఈనెల 2 నుంచి 9,10 తరగతులు ప్రారంభం కాగా, 23 నుంచి 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ, డిసెంబర్‌ 14 నుంచి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ ప్రారంభించాలని నిర్ణయించిన విషయం విధితమే. ఆ మేరకు ఆయా తేదీల నుంచి ప్రారంభమయ్యే తరగతులకు సంబంధిత టీచర్లలో ప్రస్తుతానికి రోజు సగం మంది మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతు న్నారు. వాస్తవానికి టీచర్ల హాజరుపై ఇంత వరకూ విద్యాశాఖ నుంచి లిఖిత పూర్వక ఉత్తర్వులు ఏమీ లేవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మౌఖిక ఆదేశాలపై టీచర్లందరూ రోజు విధులకు హాజరై బయోమెట్రిక్‌ హాజరు వేయాలంటూ ఒత్తిళ్లు తేవడంపై విమర్శలు వస్తున్నాయి.  

ఇంటర్‌లో తగ్గిన విద్యార్థులు 

జిల్లాలో బుధవారం 9వ తరగతి విద్యార్ధులు 6,505 మంది, పదో తర గతి 9,154 మంది హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో తొలి రెండు రోజులు విద్యార్థుల హాజరు పలుచగా ఉండగా కాస్త మెరుగైంది. పబ్లిక్‌ పరీక్షల ప్రాధాన్యత దృష్ట్యా టెన్త్‌ విద్యార్థుల హాజరు స్వల్పంగా పెరుగుతోంది. ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు బుధవారం తగ్గారు. మంగళవారం భౌతికంగా తరగతులకు హాజరైన విద్యార్థులు 4,823 మంది కాగా, బుధవారానికి వారి సంఖ్య 4,279 మందికి తగ్గింది. తరగతులకు నిర్బంధ హాజరు ఏదీ లేకపోవడం, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కరోనా భయాందో ళనలు కొనసాగుతుండడం వల్ల మరికొన్ని రోజులు ఇదే పరి స్థితి కొనసాగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నారు.  

ఎక్కువ కేసులు వస్తే సెలవులు : డీఈవో సీవీ రేణుక 

జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు, టీచర్లకు కరోనా పాజిటివ్‌ రావడంపై తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని డీఇవో సీవీ రేణుక అన్నారు. పాఠశాలల్లో కరోనా కలకలం పై మీడియాలో వస్తున్న ప్రచారంపై బుధవారం రాత్రి వివరణ ఇచ్చారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొవిడ్‌ టెస్ట్‌లు నిర్వహి స్తున్నామని, ఈ క్రమంలో అక్టోబర్‌ 26 నుంచి 28వ తేదీ మధ్య వివిధ పాఠశాలల్లో చేసిన కరోనా వీఆర్‌డీఎల్‌ టెస్టు ల ఫలితాలు బుధవారం వచ్చాయని వివరించారు. ఈ ఫలితాల్లో కొందరికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందన్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన పాఠశాలలను శానిటైజ్‌ చేయిస్తామని, ఎక్కువ కేసులు నమోదైన పాఠశాలలకు కొన్ని రోజులపాటు సెలవులు ప్రకటిస్తామన్నారు. జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలున్న టీచర్లు, కొన్ని రోజుల పాటు సెలవులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తు న్నట్టు చెప్పారు. వీరు పాఠశాల విధులకు నిర్బంధ హాజ రు ఏమీ లేదని, ఆ మేరకు ఏపీ టెల్స్‌ యాప్‌లో సెలవు కోరుతూ మినహాయింపు పొందవచ్చునన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad