సంక్రాంతి తర్వాతే బడులు

సంక్రాంతి తర్వాతే  బడులు 

సిలబస్ మరింత కుదింపు

1 నుంచి 5 తరగతులు సంక్రాంతి అయ్యాకే

6 నుంచి 7తరగతులు డిసెంబర్ 14నుంచి

శీతాకాలం దృష్ట్యా పాఠశాలలపనివేళల్లో మార్పులు

అమరావతి, ఆంధ్రప్రభ:* రాష్ట్రంలో ఒకటి నుంచి ఐదోతరగతి పాఠశాలలు సంక్రాంతి తర్వాతే తెరుచుకోను న్నాయి. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా సుదీర్ఘ విరామం తర్వాత నెల రెండో తేదీ నుంచి 9, 10 తరగతులు ప్రారంభమైన ఈ విషయం తెలిసిందే. ఈ నెల 23 (సోమవారం) నుంచి 6, 7, 8 తరగతులను ప్రారంభిస్తామనిఇదివరకే ప్రకటించినప్పటికీ.. కరోనా కేసులు తగ్గకపోవడంతో 8వ తరగతికి మాత్రమే క్లాసులు ప్రారంభమయ్యాయి. 6, 7 తరగతులను డిసెంబర్ 14 నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్య దర్శి బి. రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అలాగే కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అమలు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటా 45 నిమిషాల వరకు ఉన్న పనివేళలను ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటా 30 నిమిషాలకు మారుస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే నవంబర్ రెండో తేదీన 9, 10 తరగతులు ప్రారంభించిన సమయంలోనే 23 నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభిస్తామని ప్రక టించిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్ కేసులు తగ్గకపోవడంతో ఎనిమిదో తరగతి మాత్రమే ప్రారంభించి, 6, 7 తరగతుల ప్రారంభాన్ని డిసెంబర్ 14కు వాయిదా వేశారు. ఆ తేదీ నుంచి ప్రారంభించాల్సిన ఒకటి నుంచి ఐదు తరగతులను సంక్రాంతి పండుగ తర్వాతకు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సిలబస్ మరింత కుదింపు

1నుంచి 7 తరగతుల ప్రారంభం మరింత ఆలస్యం అవుతుండటంతో ఆ మేరకు సిలబస్ లోనూ మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇప్పటికే కొవిడ్ కారణంగా సగం పనిదినాల్లో కోత పడటంతో 35 శాతం వరకు సిలబస్ ను తగ్గించి పాఠ్య పుస్తకాలను సిద్ధం చేశారు. అయితే మరిన్ని పనిదినాలు తగ్గే పరిస్థితుల్లో సిలబస్ లో మార్పులు చేయాలని ఎస్ సీఈ ఆర్ టీ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ఇక పూర్తిస్థాయిలో పాఠశాలలు 

* ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:*

డిసెంబరు 14 నుంచి 6, 7 తరగతులు, సంక్రాంతి తరువాత 1 నుంచి 5వ తరగతి క్లాసులు ప్రారంభించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనాతో ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటిదాకా తెరుచుకోని పాఠశాలలను పూర్తిస్థాయిలో నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 9,10 తరగతులను నిర్వహిస్తున్న ప్రభుత్వం సోమవారం నుంచి 8వ తరగతి క్లాసులను ప్రారంభించింది. రాష్ట్ర వాప్తంగా 8వ తరగతిలో 70శాతానికి పైగా విద్యార్థులు తరగతులకు హాజరుకావడంతో అన్ని తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 130 గంటల వరకు ఒక్కపూట పాఠశాలలకు అనుమతిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad