AMMA VODI 2021 GUIDELINES

 అమ్మ ఒడి పథకం-  షెడ్యూల్(2020-21)::

⊹ ఉత్తర్వుల సారాంశం::-

❖ డిసెంబర్ 9-25 వరకు అమ్మ ఒడి పై ముందస్తు చర్యలు  ఉద్యమం స్థాయిలో జరుగును.

❖ చైల్డ్ ఇన్ఫో/ జ్ఞానభూమి పోర్టల్ లో నమోదు అయిన విద్యార్ధులను బట్టి అర్హులైన  తల్లుల / సంరక్షకుల జాబితాను 6 అంచెల ప్రమాణం ప్రకారం పరిశీలించి డిసెంబర్ 16 న జాబితాను విడుదల చేయడం జరుగుతుంది.

❖ ప్రధానోపాధ్యాయులు డిసెంబర్ 10-20 మధ్య విద్యార్థుల నమోదు/అప్డేట్ తప్పనిసరిగా చేయాలి.

❖ డిసెంబర్ 10-15 మధ్యకాలంలో అప్డేట్ అయిన విద్యార్ధుల వివరాలు APCFSS వారికి డిసెంబర్ 15, సాయంకాలం 6 గంటలకు అందజేయబడుతుంది.

❖ వారు ఆ వివరాలను 6 అంచెల ప్రమాణం ప్రకారం పరిశీలించి అర్హులైన తల్లుల/ సంరక్షకుల జాబితాను డిసెంబర్ 19, సాయంత్రం 6 గంటల తరువాత ఆ వివరాలను అమ్మ ఒడి పోర్టల్  లో ప్రకటిస్తారు.

❖ డిసెంబర్ 20-24 మధ్య అమ్మ ఒడి పోర్టల్ లో ప్రకటించిన వివరాలను పాఠశాల నోటీసు  బోర్డులో మరియు గ్రొమ/వార్డు సచివాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.

❖ తల్లుల/ సంరక్షకుల ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబరు మరియు IFSC కోడ్ నెంబర్ లలో తప్పులు దొర్లితే ప్రధానోపాధ్యాయులు సరిదిద్దవలసి ఉంటుంది.

❖ అనర్హత పట్ల అభ్యంతరాలను గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా స్టాండర్డ్ ప్రొసీజర్ ద్వారా కలెక్టర్ వారికి సమర్పించవలసి ఉంటుంది. వీటిని జాయింట్ కలెక్టర్ వారు పరిష్కరిస్తారు.

డిసెంబర్ 16  న విడుదల చేసిన మొదటి జాబితా మరియు డిసెంబర్ 20 న విడుదల చేసిన జాబితా ను క్రోడీకరించి ,వీటిలోని సరిదిద్దిన అభ్యంతరాలతో గల తుది జాబితాను డిసెంబర్ 26 న అమ్మ ఒడి పోర్టల్ లో పొందుపరచడం జరుగుతుంది.

❖ తుది జాబితా డిసెంబర్ 27-28 న వార్డు/ గ్రామ సభచే ఆమోదం పొందవలసి ఉంటుంది.

❖ ఆమోదం పొందిన తుది జాబితాను గ్రామ/వార్డు విద్యా సంక్షేమ సహాయకుడు డిసెంబర్ 29 న ఆన్లైన్ ద్వారా అందజేయవలసి ఉంటుంది.

❖ ప్రధానోపాధ్యాయుడు డిసెంబర్ 30 లోగా మండల విద్యాశాఖ అధికారి వారి ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి వారికి అందజేయ వలసి ఉంటుంది.

❖ జిల్లా విద్యాశాఖాధికారి ఆ జాబితాను డిసెంబర్ 30 నాటికి  జిల్లా కలెక్టరు వారి ఆమోదానికి సమర్పించ వలసి ఉంటుంది.

Download Guidelines 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad