Message form Director school Education abut Transfers web options

 జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రాంతీయ విద్య యొక్క సంచాలకులకు ఒక అత్యవసర సమాచారం.

బదిలీలకు సంబంధించి  వెబ్ ఆప్షన్ల లో మార్పులు చేసుకోవడానికి ఉపాధ్యాయులకు రేపటి దాకా సమయం ఇచ్చినట్లుగా ఈరోజు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము. అది రేపు పత్రికల్లో వస్తుంది. అయితే ఈ లోగా చాలామంది ఉపాధ్యాయులు వారు కోరుకున్న వెబ్ ఆప్షన్లుమెసేజ్ లు డిస్ప్లే కావటం లేదని, నెట్టు పనిచేయడం లేదని మెసేజీలు లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఆందోళన చెందుతున్నారు.

వెబ్ ఆప్షన్లు పెట్టిన తర్వాత వాటిని పూర్తిగా చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని ఒక ప్రింటవుట్ తీసుకున్న తర్వాతనే ఉపాధ్యాయుల  బదిలీలకు వెళ్లాలని కోరుకోవటం సహజం. అందువల్ల వారికి వారు కోరుకున్న విధంగా ఆప్షన్లు పూర్తిగా డిస్ప్లే అయి ఒక ప్రింటవుట్ పొందడానికి  తగినంత సమయం ఇవ్వటానికి నిర్ణయించడం జరిగింది. అందువల్ల వెబ్ ఆప్షన్ లను ఫ్రీజ్ చేయటానికి గడువు పొడిగిస్తూ ఉన్నాము. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ రేపు( 18.12.2020)  తెలియపరచడం జరుగుతుంది.

కాబట్టి.ఉపాధ్యాయులు ఆందోళన చెందనవసరం లేదు. ఈ సమాచారాన్ని సంబంధిత గ్రూపులో అన్నిటిలోనూ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము.

సంచాలకుడు, పాఠశాల విద్యాశాఖ

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad