పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను కొట్టివేసిన హై కోర్ట్

 అమరావతి: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ షెడ్యూల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంపై జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. హైకోర్టు తాజా నిర్ణయంతో ఇప్పట్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టేనని స్పష్టమైంది. వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తుందని హైకోర్టు భావించింది. ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని, అందువల్లే ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది.

రెండు గంటలపాటు హైకోర్టులో ఏజీ ప్రభుత్వ వాదనలు వినిపించారు. ఏకకాలంలో ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ కష్టమని ప్రభుత్వం వాదించింది. ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నెల 8న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. హైకోర్టు తాజా తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad