పనిచేయని అమ్మఒడి వెబ్‌సైట్‌

అనంతపురం విద్య, డిసెంబరు 31 : అమ్మఒడి వెబ్‌సైట్‌ పనిచేయకపోవటంతో ప్ర భుత్వం ఐదురోజుల గడువు పొడిగించినా ఫలితం లే కుండాపోయింది. గడువు పెంపుతో గ్రామ సభ లు, సామాజిక తనిఖీల్లో వచ్చిన అభ్యంతరాల సవరణకు అవకాశం ఉందని భావించారు. ఈ క్రమంలో జనవరి 5వ తేదీ వరకూ అవకాశం ఉంటుందని అమ్మఒడికి సం బంధించిన పలు సమస్యలు, ఇతర సవరణల కోసం పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు, పాఠశాలల ప్రధానో పాధ్యాయుల వద్దకు పరుగులు తీశారు. వెబ్‌సైట్‌ పని చేయకపోవటంతో తామేమి చేయలేమంటూ వారిని తిప్పిపంపుతున్నారు. బుధవారం ఉద యం నుంచి సైట్‌ పనిచేయడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad