ఉద్యోగుల్లో వార్.. బొప్పరాజు వర్సెస్ వెంకట్రామిరెడ్డి.

అమరావతి: స్థానిక ఎన్నికలు ఏపీ ఉద్యోగుల్లో చిచ్చు రేపాయి. కరోనా వ్యాక్సిన్ కారణంగా స్థానిక ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టును కోరింది. ఈ నిర్ణయానికి సచివాలయ, అమరావతి ఉద్యోగులందరూ మద్దతు ఇచ్చారు. హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ ఎన్నికల సంఘానికి తీర్పు అనుకూలంగా వచ్చింది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. అటు ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు సహరించేందుకు సిద్ధమైంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు రెండు సంఘాల మధ్య చిచ్చుపెట్టింది. తొలి నుంచి కూడా ఈ రెండు సంఘాలు కరోనా వ్యాక్సిన్ పంపిణీ పూర్తయ్యాకే ఎన్నికల నిర్వహించాలని ప్రభుత్వ వాదనకు మద్దతిస్తూ ఎస్ఈసీని పట్టుబట్టాయి. అయితే కోర్టు తీర్పు తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఎస్ఈసీకి సచివాలయ ఉద్యోగులు సహకరిస్తామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు. కొంతమంది ఉద్యోగులను కొన్ని రాజకీయ పార్టీలు అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటున్నాయని (అమరావతి ఉద్యోగుల జేఏసీని ఉద్దేశించి) వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పాల్గొనబోమని ఎప్పుడూ అనలేదని, ఆరోగ్యం సరిగా లేని ఉద్యోగులను మినహాయించాలని మాత్రమే కోరామని  సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి అన్నారు. దీంతో ఏపీ సచివాలయ ఉద్యోగులు, అమరావతి ఉద్యోగుల జేఏసీ మధ్య మాటలయుద్ధం సాగుతోంది. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వర్సెస్ అమరావతి ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజుగా మారింది.

అటు అమరావతి ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు మాత్రం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ప్రాణ హాని ఉందని, సరైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎన్నికల పంచాయితీపై వెంకట్రామిరెడ్డి అతిగా స్పందించారని బొప్పరాజు మండిపడ్డారు. కింది స్థాయి ఉద్యోగులతో వెంకట్రామిరెడ్డికి సంబంధమే లేదన్నారు. సచివాలయానికి వెళ్లే   రెవెన్యూ ఉద్యోగుల పట్ల వెంకట్రామిరెడ్డి తీరు తీవ్ర ఆక్షేపనీయన్నారు. ఉద్యోగుల జీవితాలతో వెంకట్రామిరెడ్డి ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, బెనిఫిట్స్ రాకుండా వెంకట్రామిరెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక బొప్పరాజు వ్యాఖ్యలపై వెంకట్రామిరెడ్డి స్పందించారు. బొప్పరాజు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. వ్యాక్సిన్ సమయంలో ఎన్నికలు ఉద్యోగులకు భారమని వాయిదా కోరామని చెప్పారు. అందరూ మొదట ఎస్‌ఈసీ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించారని చెప్పారు. కోర్టు తీర్పు ఎస్‌ఈసీకి అనుకూలంగా రావడంతో కమిషన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని మాట మార్చారన్నారు. బొప్పరాజు ఆరోపణలతో ఉద్యోగుల పరువు పోతోందని వెంకటరామిరెడ్డి అన్నారు

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad