ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తెలిపింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని, రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఉత్కంఠ రేపిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు... పంచాయతీ ఎన్నికలను ఆపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.. ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఈ సమయంలో ఎన్నికల వాయిదా కుదరదని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరపాల్సిందేనని తేల్చిచెప్పింది... ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌తో పాటు ఎన్జీవోల పిటిషన్లను కూడా కొట్టివేసింది అత్యున్నతన్యాయస్థానం.. ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించగా.. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా? అని ప్రశ్నించింది సుప్రీం.. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని, కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారన్న విషయాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల కమిషన్‌ను తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, ఎన్నికలు ప్రతీసారి వాయిదా పడుతున్నాయని జస్టిస్ సంజయ్ పేర్కొన్నారు.. ఎస్‌ఈసీ విధుల్లో భాగంగానే ఎన్నికల ప్రక్రియ అని స్పష్టం చేసిన ఆయన.. ఏదో వంకతో ఎన్నికలు ఆపాలని చూస్తున్నారు.. ఎన్నికలు రాజకీయ ప్రక్రియలో భాగం.. కరోనా ప్రభావం తగ్గినప్పుడు ఎన్నికలు ఎందుకు వద్దంటున్నారు అని ప్రశ్నించారు. ఇక, రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.
రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది.
దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా అన్న ధర్మాసనం.. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని పేర్కొంది. కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలని కోరిన విషయాన్ని జస్టిస్ కౌల్ ప్రస్తావించారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారన్నారు. ఎస్‌ఈసీ సమావేశానికి ఉద్యోగ సంఘాలు ఎందుకు హాజరు కాలేదని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు.