ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలు 4 రోజుల్లో పరిష్కారం - మహిళా ఉద్యోగులకు 5 ప్రత్యేక CLs

 పీఆర్సీ నివేదిక త్వరలో బయటపెడతాం ..ఏప్రిల్ లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

unions-meeting-with-govt

ఉద్యోగ సంఘాల భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

మహిళా ఉద్యోగులకు శుభవార్త

5 ప్రత్యేక సీఎల్ లకు ప్రభుత్వం అంగీకారం

మార్చి 8 లోపు ఉత్తర్వులు*

ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఉద్యోగులకు ఇది శుభవార్త.

వారికి ఏడాదికి 5 ప్రత్యేక క్యాజువల్ లీవులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగ సంఘాలతో గురువారం రాత్రి నిర్వహించిన సమావేశంలో

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ సంగతి ప్రకటించారు. మహిళా దినోత్సవం మార్చి 8 లోపు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇస్తామన్నారు 


ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. పీఆర్సీ నివేదికను త్వరలోనే బయట పెడతామన్నారు.

ఉద్యోగుల సమస్యల కూలంకషంగా విని పరిష్కరించేందుకు ఏప్రిల్ నెలలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతకుముందు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు ...తమ సమస్యలను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్,

ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ కు విన్నవించారు.  సీపీఎస్ రద్దు చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు, ఇతర బెనిఫిట్స్ అందజేయాలని కోరారు.

నాలుగో తరగతి ఉద్యోగుల రిటైర్మెంట్ కాలాన్ని 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని కోరారు.  డీఎస్సీ ద్వారా తక్షణమే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టాలని యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ప్రతినిధులు కోరారు.  హెల్త్ కార్డులతో నగదు రహిత వైద్యం అందించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శులతో పాటు ఏపీ ఏన్జీవో సంఘ ప్రతినిధులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ తరఫున బొప్పరాజు వెంకటేశ్వర్లు,రాష్ట్ర సచివాలయం సంఘ ప్రతినిధులు వెంకట్రామిరెడ్డి, ప్రసాద్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, యూటీఎఫ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పి.బాబురెడ్డి, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు

సూర్యనారాయణ, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad