5 రాష్ట్రాల అసెంబ్లీ పోరుకు తేదీలు ఖరారు చేసిన ఈసీ

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం,పుదుచ్చేరి, తిరుపతి, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలకూడా

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం సహా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించింది. మొత్తంగా త్వరలో జరగబోయే ఐదు అసెంబ్లీల్లో 824 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరగనున్న పరిధిలో 18.68 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు 2.7 లక్షల సిబ్బందిని వినియోగించనున్నట్లు ఈసీ ప్రకటించింది. 

బెంగాల్‌లో 8 విడతల పోలింగ్.. ఫలితాలు మే 2న

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను 8 దశల్లో నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. బెంగాల్‌లో మార్చి 27న మొదటి దశ పోలింగ్‌, ఏప్రిల్‌ 1న రెండో దశ పోలింగ్‌, ఏప్రిల్‌ 6న మూడో దశ పోలింగ్‌, ఏప్రిల్‌ 10న నాలుగో దశ పోలింగ్‌, ఏప్రిల్‌ 17న ఐదో దశ పోలింగ్‌, ఏప్రిల్‌ 22న ఆరో దశ పోలింగ్‌, ఏప్రిల్‌ 26న ఏడో దశ పోలింగ్‌, ఏప్రిల్ 29న చివరి దశ పోలింగ్ జరనున్నట్లు ఈసీ తెలిపింది. ఇక ఎన్నికల ఫలితాలను మిగతా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే మే 2న ప్రకటించనున్నట్లు ఈసీ పేర్కొంది.

అస్సాంలో 3 దశల పోలింగ్

అస్సాం అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మార్చి 2న ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని, నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 9 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇక మార్చి 10న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, మార్చి 27న మొదటి దశ పోలింగ్, ఏప్రిల్‌ 1న రెండోదశ పోలింగ్‌‌, ఏప్రిల్‌ 6న మూడోదశ పోలింగ్‌ జరుగుతుందని.. మే 2న కౌంటింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.

తమిళనాడు అసెంబ్లీ పోలింగ్ ఏప్రిల్ 6న

తమిళనాడు అసెంబ్లీకి ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు దక్షిణాదిలో కీలకమైన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 6న పోలింగ్ జరపనున్నట్లు ఈసీ తెలిపింది. ఇక ఫలితాలు మే 2న విడుదల కానున్నాయి.

కేరళలో ఏప్రిల్‌ 6న పోలింగ్‌

కేరళలో ఒకే దశలో పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేరళలో ఏప్రిల్‌ 6న పోలింగ్‌.. మే 2న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. అదేవిధంగా ఏప్రిల్‌ 6న రాష్ట్రంలోని మల్లాపురం లోక్‌సభ ఉప ఎన్నిక నిర్వహిస్తారు.

పుదుచ్చేరిలో ఒకే దశలో పోలింగ్‌

పుదుచ్చేరిలో ఒకే దశలో పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఏప్రిల్‌ 6న పోలింగ్ జరగనుంది‌. ఇక మే 2న కౌంటింగ్‌ నిర్వహిస్తారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad