ప్రధానోపాధ్యాయుల కర దీపిక (Headmaster's Hand Book)

hms-hand-book-001

 ఉపాధ్యాయ మిత్రులారా !

నేటి విద్యా విధానం శాస్త్ర సాంకేతికాభివృద్ధి వలన వచ్చిన మార్పుల ద్వారా నూతన ఒరణ ప్రయాణాన్ని సాగిస్తోంది. ఇదే క్రమంలో సంపూర్ణమైన విధి నిర్వహణ కోసం ప్రధానోపాధ్యా దీపికను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ మీ ముందుకు తీసుకొస్తుంది. విద్యార్ధులలో మూర్తి మత్వం పెంపొందించడంతో పాటు ప్రధానోపాధ్యాయుల్లో సానుకూల దృక్పధాన్ని, విశ్లేషణ జనాత్మకతను పెంపొందించి తద్వారా విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల ఆధారంగా ఆశించిన అభ్యసనా ఫలితాలను  సాధించడానికి వినూత్న వ్యూహాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నాం.  వివిధ -బోధన, అభ్యసనా ఫలితాలు మరియు పరిశోధనల పట్ల మరింత దృష్టి సారించాము. అందుకు గాను ఆశావాద  దృక్పథంతో విద్యార్థి కేంద్రీకృతంగా విద్యా సంస్కరణలను, వినూత్న విద్యా విధానాలు అమలు  పరుస్తున్నాము.

ఇటీవల కాలంలో నిర్వహించిన టీచర్స్ నీడ్ ఐడెంటిఫికేషన్ సర్వే (INIS), నేషనల్ అచీవ్మెంట్ సర్వే (NAS), స్టూడెంట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే (SLAS) లలో వచ్చిన ఫలితాలను విశ్లేషించి విద్యా ప్రమాణాల ద్వారా ఆశించిన అభ్యసన ఫలితాల సాధనకు అనుసరించవలసిన బోధనా వ్యూహాలను నిర్దేశించుకున్నాము. ఈ కరదీపిక ప్రధానోపార్యాలయులకు సమర్ధవంతమైన పర్యవేక్షణతో పాటు అభ్యసనా ఫలితాలను సాధించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ఈ కరదీపిక ప్రధానోపార్యాయులకు సమర్థవంతమైన పర్యవేక్షణతో పాటు వారిలో ప్రేరణ నూతనోత్తేజాన్ని ఆత్మవిశ్వాసాన్ని, ఆలోచనా దృక్పథాన్ని, పరిపాలనా దక్షతను పెంపొందించి, సమయపాలనతో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి దోహద పడుతుంది.

విద్యార్థులలో ఆశించిన అభ్యసన ఫలితాల సాధనకు మీరు తప్పక కృషి చేసి తద్వారా విద్యార్థులను సంపూర్ణ మూర్తిమత్వం గల భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో మీవంతు కృషి మరియు సహకారము కొనసాగిస్తారని ఆశిస్తూ....

శ్రీ డి, మధుసూదనరావు -

సంచాలకులు

రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad